ప్రైవేట్ స్కూల్స్ కు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాక్..! కేసీఆర్ నిర్ణయంతో పేరెంట్స్ సేఫ్.! అసలేమైంది.?

ఫీజుల పెంపు విషయంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఎవరికి నచ్చినంత వారు పెంచేసుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ప్రభుత్వ నిబంధనలతో అసలు సంభంధంలేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ విధ్యార్దులపై ఫీజుల భారం మోపుతున్నాయి. ఎట్టకేలకు ఫీజులు పెంచుకుంటామని మొండిగా ఉన్న ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది..

రాష్ట్రంలోని  ప్రైవేటు స్కూల్స్ ఎడాపెడా ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఒక సర్కులర్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచుకోవడానికి వీలు లేదంటూ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ఈ నెల 11 న పాఠశాలల యజమాన్యాలతో భేటీ అయిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఫీజులు పెంచుకుంటామని ఖరాఖండీగా చెప్పిన విషయం తెలిసిందే. దీనిఫై సీరియస్ గా స్పందించిన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య..1983 ఎడ్యుకేషనల్ ఆక్ట్ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అధికారం ఉందని… చట్టానికి విరుద్దంగా ప్రవర్తిస్తే లీగల్ చర్యలు తీసుకోవడమేకాకుండా, ఫెనాల్టీలు వేస్తామన్నారు. అవసరమైతే పాఠశాలల గుర్తింపు రద్దు చేసే అధికారం కూడా తమకు ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను దిక్కరిస్తే చర్యలు తప్పవని సర్కులర్ లో స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Comments

comments

Share this post

scroll to top