దంతాలు తెల్ల‌గా, దృఢంగా మారాలా..? కొబ్బ‌రి నూనెతో త‌యారు చేసే ఈ మిశ్ర‌మాన్ని వాడండి..!

కొబ్బరినూనె వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. జుట్టు కోసం ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వెంట్రుక‌ల‌కు సంర‌క్ష‌ణ చేకూరుతుంది. జుట్టు దృఢంగా పెరుగుతుంది. చాలా ప్రాంతాల్లో కొబ్బ‌రినూనెను వంట‌ల్లో కూడా ఉప‌యోగిస్తారు. దాని వ‌ల్ల ఎన్నో కీల‌క పోష‌కాలు మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అయితే ఇవే కాదు, కొబ్బ‌రినూనె వ‌ల్ల మ‌న‌కు చెప్పుకోద‌గిన ఉప‌యోగాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే…

కొబ్బ‌రినూనెతో త‌యారు చేసే ఓ మిశ్ర‌మాన్ని వాడ‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఆ మిశ్ర‌మం ఎలా త‌యారు చేయాలంటే…

కావల్సిన పదార్థాలు …
కొబ్బరినూనె – 3 టేబుల్‌స్పూన్లు
పెప్పర్‌మింట్ ఆయిల్ – 4, 5 చుక్కలు
బేకింగ్ సోడా – 2 టేబుల్ స్పూన్లు

త‌యారీ విధానం…
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ క‌లిపి మిశ్రమంలా త‌యారు చేసుకోవాలి. దీంతో ప్రతి రోజూ పళ్లు తోముకోవాలి. అలా వీలు కాక‌పోతే డైరెక్ట్‌గా కొబ్బరినూనెనే నోట్లో పోసుకుని రోజూ 15 నిమిషాల పాటు పుక్కిలించ‌వ‌చ్చు. దీంతో కింద చెప్పిన ఫ‌లితాలు క‌లుగుతాయి.

1. కొబ్బ‌రినూనెలో స‌హ‌జ సిద్ధ‌మ‌న యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి దంతాల‌ను సూక్ష్మ క్రిముల నుంచి ర‌క్షిస్తాయి.

2. నోటి దుర్వాసన పోతుంది. నోరు, నాలుక రెండూ శుభ్ర‌మ‌వుతాయి.

3. దంత క్ష‌యం పోతుంది. దంతాలు పుచ్చు ప‌ట్ట‌వు.

4. చిగుళ్ల స‌మ‌స్య‌లు పోతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి. చిగుళ్ల నుంచి ర‌క్తం కారే స‌మ‌స్య ఉంటే పోతుంది.

5. దంతాలు తెల్ల‌గా మారుతాయి. దృఢంగా ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top