వాట్సాప్ జబర్దస్త్ ఫీచర్: డిలీట్ చేసిన దాన్ని మళ్లీ ఎలా పొందాలో తెలుసా.?

ఎప్పటికప్పుడు  వినియోగదారులను ఆకట్టుకోవడానికి  ఎదో ఒక ఫీచర్ ను వాట్సప్ అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సప్ ప్రారంభమయినప్పటినుండి ఇప్పటివరకు వాట్సప్లో వచ్చిన కొత్త ఫీచర్లను వినియోగదారులు ఇష్టపడ్డారు.వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు వాట్సప్ తన వంతుగా  మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తేనుంది.ఇంతకీ ఇప్పుడు రాబోయే ఫీచర్ ఏంటంటే డిలీట్ చేసిన వాటిని తిరిగిపొందే అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తుంది.
గతంలో వాట్సప్ కి ఈ మధ్య కాలంలో వాట్సప్ కి చాలా తేడా వుంది.ఎన్నో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.అందులో భాగమే పొరపాటున ఏదన్నా మెసేజ్ చేస్తే అవతల వారు చూసేలోపు ా ఆ మెసేజ్ ను  పంపినవారే డిలీట్ చేసుకునే అవకాశం కల్పించింది.అదే విదంగా స్టాటస్ అనే ఆఫ్షన్ ని కొత్తగా ప్రవేశపెట్టింది వాట్సప్.ఈ ఫీచర్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంది.ఇప్పుడు మనం డిలీట్ చేసిన వాటిని తిరిగి పొందే అవకాశం కల్పిస్తుంది. డబ్ల్యూబీటాఇన్ఫో కథనం ప్రకారం ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌ యూజర్ల కోసం ఈ ఫీచర్ను పరీక్షిస్తోంది. అది సక్సెస్ అయితే స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ నుంచి ఏమైనా ఇమేజస్‌ను, జీఐఎఫ్‌ఎస్‌ను, వీడియో, ఆడియో ఫైల్స్‌ను, ఆడియో రికార్డింగ్‌లను, డాక్యుమెంట్లను డిలీట్‌చేస్తే, వాటిని తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.డివైజ్‌లలో తక్కువ స్టోరేజ్ కలిగి ఉన్న యూజర్లకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు.

దీంతోపాటు మరో అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇద్దరి మధ్య సంభాషణలను మరొకరు చూడకుండా ఇది చేయగలుగుతుంది. ఓ యూనిక్‌ సెక్యూర్‌ కోడ్‌ రూపంలో ఛాట్‌ను కొత్త ఫీచర్ భద్రపరుస్తుంది. దీంతో అది వాళ్లిద్దరు మాత్రమే చూడగలిగేలా ఉంటుంది. విశేషం ఏంటంటే ఒక్కో ఛాట్‌కి ఒక్కో ప్రత్యేకమైన్‌ కోడ్ ‌జనరేట్‌ అవుతుంది. దీంతో చివరికి వాట్సప్‌ సైతం ఆయా మెసేజ్‌లను చూసే వీలుండదు. ఇవీ కొత్త ఫీచర్‌లో ఉండే సౌలభ్యాలు..

Comments

comments

Share this post

scroll to top