చ‌నిపోయిన కుర్రాడిని….పాడె మీద స్మ‌శానికి తీసుకెళుతుంటే….లేచి కూర్చున్నాడు.!!

చ‌నిపోయిన 17 ఏళ్ల కుర్రాడిని అంత్య‌క్రియ‌ల కోసం స్మ‌శానికి తీసుకెళుతుంటే…ఒక్క‌సారిగా పాడె మీద నుండి లేచి కూర్చున్న ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లోని ధార్వాడ్ లో జ‌రిగింది. ప‌దిహేడేళ్ల కుమార్ ఇటీవ‌లే కుక్క‌కాటు వ‌ల్ల హాస్పిట‌ల్ లో అడ్మిట్ అయ్యాడు, టెస్ట్స్ చేసిన డాక్ట‌ర్స్ హై ఫీవర్ అని చెప్పి, వెంటిలేటర్ మీద ఉంచారు. ఒక్క‌సారిగా ఆరోగ్యం విష‌మించ‌డంతో…..విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసిన డాక్ట‌ర్స్…. మా వ‌ల్ల కాద‌ని చేతులెత్తేశారు…దీంతో కుర్రాడిని ఇంటికి తీసుకెళ్లిన అత‌ని బంధువులు మ‌ర‌ణించాడ‌ని ధృవీక‌రించుకొని అంత్య‌క్రియ‌ల నిమిత్తం సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా స్మ‌శానికి త‌ర‌లించే ప్ర‌య‌త్నంలో……..

ఊరి నుండి రెండు కిలోమీటర్లు వెళ్ళగానే పాడె పై ఉన్న కుమార్ కళ్ళు తెరిచి, చేతులు కాళ్ళు కదిలించాడు…ఫాస్ట్ గా ఊపిరి తీసుకుంటూ.. ఒక్క‌సారిగా లేచి కూర్చున్నాడు. దీంతో షాక్ అయిన గ్రామ‌స్తులు అత‌డిని వెంట‌నే హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. చ‌నిపోయాడ‌నుకున్న వ్య‌క్తి….పాడె మీది నుండి లేవ‌డంతో ఈ విష‌యం ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యింది.

Comments

comments

Share this post

scroll to top