అంబానీ గిఫ్ట్ చూడగానే ఏడ్చేసిన బోని కపూర్.! గత నెల “టీనా అంబానీ” బర్త్ డే వేడుకల్లో.?

విఖ్యాత న‌టి శ్రీదేవి మ‌ర‌ణాన్ని ఇప్ప‌టికీ ఆమె స‌న్నిహితులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. శ్రీదేవికి సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా ఇత‌ర రంగాల‌లో కూడా స్నేహితులు ఉన్నారు. శ్రీదేవికి ఉన్న స‌న్నిహితుల‌లో ప్ర‌ముఖ వ్యాపారవేత్త అనీల్ అంబానీ భార్య టీనా ఒక‌రు. తాజాగా ఆమె శ్రీదేవి భ‌ర్త బోనీ క‌పూర్‌కు ఓ కానుక పంపించార‌ట‌. ఆ కానుక చూసి బోనీ క‌పూర్ క‌న్నీళ్లు పెట్టుకున్నార‌ట‌.

గ‌త నెల 11వ తేదీన టీనా 61వ జ‌న్మ‌దిన వేడుక‌లు ముంబైలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు శ్రీదేవితోపాటు బోనీ క‌పూర్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శ్రీదేవి, టీనా క‌లిసి ప్ర‌త్యేకంగా ఓ ఫోటో తీయించుకున్నారు. ఆ వేడుక‌ల్లో పాల్గొన్న 13 రోజుల త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన శ్రీదేవి మ‌ర‌ణించారు. దీంతో శ్రీదేవి గుర్తుగా టీనా ఆ ఫోటోకు వెండి ఫ్రేమ్ చేయించి బోనీకి గిఫ్ట్‌గా ఇచ్చార‌ట‌. `శ్రీదేవితో కలిసి దిగిన ఈ ఫోటోయే ఆఖ‌రుది అవుతుంద‌ని అనుకోలేద‌`ని టీనా ఆవేద‌న‌కు లోన‌య్యార‌ట‌. కాగా, టీనా పంపించిన ఈ ఫోటో చూసి బోనీ క‌న్నీళ్లు పెట్టుకున్నార‌ట‌.

Comments

comments

Share this post

scroll to top