సమాధానం కోసం గుగూల్ వైపు, ఫ్రెండ్ షిప్ కోసం ఫేస్ బుక్ వైపు, ఎండ కొడితే ఏసి వైపు, చలేస్తే హీటర్ వైపు అదే పనిగా చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. టెక్నాలజీ ఉంది మనకోసమే అనుకొని పూర్తిగా దాని మీదే ఆధారపడుతున్న చాలా మందికి తెలియదు అదే వారి టెక్నాలజీ భవిష్యత్తుని నాశనం చేస్తుందని? అది ఎలాగో ఈ క్రింద విషయాల్ని చదవండి.
1. ఎక్కువగా సెల్ ఫోన్ వాడే వారిలో 80% మందికి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది.ఇందులో 25% పైగా మందికి వారి నెంబర్ వారికే గుర్తులేదు.
2. ఈ ఎండాకాలం లో వంటికి చెమట పట్టకుండా ఏసి లు వాడేస్తున్నారు. దీని కారణంగా వంట్లో ఎండల వలన చెమట ద్వారా బయటికి పోవలసిన వ్యర్థాలు ఒంట్లోనే ఉండిపోతున్నాయి. దీనివలన ఉబ్బసం, గ్యాస్ లాంటి గుండె సంబధిత రోగాలు శరీరాన్ని చుట్టుముడుతున్నాయి.
3. ఫ్రిడ్జ్ ఉండడం వలన కూరగాయలు దగ్గర నుండి, పండ్లు, మాంసాహారం వరకు అన్ని తీసుకెళ్ళి దాంట్లో పడేస్తున్నారు. దీనివలన ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసిన వెంటనే బ్యాక్టీరియ వచ్చేస్తుంది. దీనిద్వారా రోగాల పాలౌతున్నారు.
4. వాషింగ్ మిషిన్, మిక్సి ల వలన శారీరక శ్రమ తగ్గిపోయి తిన్నది సరిగ్గా అరగక కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా రోగాలు వస్తున్నాయి. రోళ్ళు, రోకళ్ళు ఎప్పుడో మర్చిపోయారు.
5. మాంసాహారం కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండాలని “బోన్ లెస్” అంటున్నారు. ఇంతకుపూర్వం తాత వేట మాంసం తీసుకు వస్తే దాంతో 2 ఎముకలు తీసుకోచ్చేవాడు. వాటిని వండిన తరువాత పటపట కొరికి అందులో గుజ్జు తినేవాడు. ఈరోజు అలాంటి దాన్ని కొరికితే పళ్ళు విరుగుతాయి కాని ఎముక విరగదు.
6. తిండిలో కూడా సుతిమెత్తని పదార్థాలే తింటున్నారు. వాటిలో కూడా గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారమంటే ప్రాణం ఇచ్చేస్తున్నారు. దంపుడు బియ్యం తినడం మానేశారు. మూడు సార్లు బియ్యానికి పాలిష్ పెట్టి బియ్యంలో ఉన్న జీవం తీసేసి అందంగా ప్యాక్ చేసిన బియ్యం మాత్రమే తింటున్నారు. పిజ్జాలు, బర్గర్లు, పానిపూరి, మసాలా, పునుగులు, మిరపకాయ బజ్జీలు. ఇలా ఒకటేమిటి సాయంత్రం అయ్యిందంటే ఆయిల్ ఫుడ్ తప్పనిసరిగా లాగించేస్తున్నారు. దీనివలన గ్యాస్, ఉదర సమస్యలు, కిడ్నీలలో రాళ్లు, తింటే ఆయాసం, తినకపోతే నీరసం. సర్వరోగాలు కొనుక్కుని తెచ్చుకుంటున్నారు.
7. బైక్ లు ఉండడం వ వలన కాలికి బుద్ధి చెప్పడం మానేశారు. సందు చివరికి కూడా బండి కావలసిందే. దీనివలన కాలుష్యం పెరుగుతుంది. మరోప్రక్క పెట్రోల్ వాడకం పెరిగిపోయి భూమిలోని సారం మొత్తం లాగేస్తున్నాయి ఆయిల్ కాలుష్యం.. దీనివలన భూతాపం పెరిగిపోతున్నది.
8. ప్రతి ఇంట్లో బోరింగ్, ఎక్కడికక్కడ టాప్ లు. కనీసం బకీటుతో నీళ్ళు కూడా మోయరు.
9. చెట్లు పెంచే స్థలం ఉండదు. ఒకవేళ ఉంటే ఆస్థలంలో ఇల్లు కట్టేస్తున్నారు. ఒకవేళ ఉన్నా చెట్లు మాత్రం పెంచరు. ఎందుకంటే రాలే ఆకులు మేము ఊడవలేము అనేస్తున్నారు.
ఇలా ఎక్కడికక్కడ సుఖపడే మార్గాలు ఎంత కష్టమైనా పడి సాధిస్తున్నారు. లక్షలు తగలేస్తున్నారు. ఆ లక్షలతోనే రోగాలు తీసుకోచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఐతే ఇవన్ని వాడొద్దా అంటారా? కాదు. వాడండి. కాని అవసర సమయాల్లో మాత్రమే వాడండి. ఉన్నాయి కదా అని వాడేస్తే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. కనుక హద్దులు దాటకుండా వాడండి. శరీరానికి తగినంత పనిచేప్పండి. ఆరోగ్యం ఆయుష్షు రెండూ పెరుగుతాయి.
———————————– *ఉత్తమ్*