తేనెటీగలు కుట్టని మనిషి అచ్చర్యంగా..? ఉందా ఒకసారి చదివి చూడండి!!

ప్రతి ఇంట్లో సాధారణంగా పెంపుడు జంతువులు పెంచుతూ ఉంటారు. కొందరు పిల్లుల్ని, మరికొందరు కుక్కల్ని పెంచుతూ ఉంటారు. ఇంకా మరికొందరైతే పావురాలను, రామచిలుకల్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి అయితే ఏకంగా ఎంతో ప్రమాదకారమైన తేనేటిగల్ని పెంచుతున్నాడు.

ఇథియోపియాలో నివసిస్తున్న గోసా టఫీస్ తన ఇంట్లోనే తేనెటీగలను పెంచుతూ ఉంటారు. మరి ఇవి ఆయనని ఏమి చేయవా అని. కానీ తేనెటీగలు ఆయనతో ఫ్రెండ్ షిప్ చేస్తాయంట.గోసాని ఫాదర్ ఆఫ్ బీస్’, ‘ఫాదర్ ఆఫ్ హనీ’ అని పిలుస్తారంట.

గోసా ఇంటికి 15 ఏళ్ల క్రితం తేనెటీగలు వచ్చాయి. కానీ, అవి తిరిగి వెళ్లలేదు. గోసా ఎక్కడుంటే అక్కడకు వస్తాయి, ఆయన తోనే ఉంటాయి. అందుకే, అవన్నీ తన కుటుంబంలో భాగమేనని అంటున్నాడు గోసా. వాటిని వారంతా కుటుంబ సభ్యుల్లాగే చూస్తామని అంటున్నారు.
వాళ్ల ఇంట్లో ఉన్న ఓ పెద్ద తేనెతుట్టె ఉండేదట. దాని నుంచి 25 – 30 కేజీల తేనె వచ్చేది. కానీ, తేనెటీగలు ఎక్కువైపోయి, అది చాలా పెద్దదిగా అయిపోయింది. అయితే ఇరుగుపొరుగువారిని మాత్రం అవి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టాయట. అందుకే తేనెతుట్టని చిన్నదిగా చేశాడట.

తేనెటీగలు చుట్టుపక్కల వారికి అప్పుడప్పుడు సమస్యగా మారడంతో గోసా ఆ పెద్ద తేనెపట్టును తీసేసి, ఈగలను బయటకు పంపించేయాలని కూడా ప్రయత్నించారు. కానీ, తేనెటీగలు మళ్ళీ వచ్చేశాయి. ఒకానొక సమయంలో తన భార్య వల్లనే మళ్ళీ వచ్చాయని చెట్టుకు కట్టేసి కొట్టాడు.
తన స్నేహితులను చదువుకోవడానికి ఇక్కడకు రమ్మంటే, ఈగలు కుడతాయని భయపడతారని.. దీంతో గోసా కూతురే తన స్నేహితుల ఇంటికి వెళ్లి చదువుకుంటుందట.

తానెక్కడికి వెళ్లినా ఈగలు కూడా వస్తాయి, కానీ, అవి అలా ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదంటున్నారు గోసా.
అయినా, తననందరు ప్రత్యేకమైన వ్యక్తిలా చూస్తారని కానీ గోసా మాత్రం అలా అనుకోవట్లేదట.

 

Comments

comments

Share this post

scroll to top