వందే మాతరం.. జండాకు వందనం.. గ్రేట్ ఫర్పార్మెన్స్…!

ఆగస్ట్ 15 న అసలైన హడావుడి స్కూల్స్ లో కనిపిస్తోంది. వారం రోజుల ముందు నుండే  ఆ తయారీ కార్యక్రమాలు, ఆటల పోటీలు… రంగుల కాగితాలతో క్లాస్ రూమ్ లను అలంకరించుకోడాలు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం రోజూ సాయంత్రం  రెండు గంటల పాటు  చేసే ప్రాక్టీస్ లు .. ప్రైజ్ ల కోసం ఆడే కబడ్డీ , ఖోఖో లు, పగిలే మోకాలి చిప్పలు,   స్పీచ్ కోసం పదిహేను బుక్స్ ముందేసుకొని అందులో మంచి మాటలను సేకరించుకొని వాటిని క్రమ పద్దతిలో అమర్చుకోడాలు…  అబ్బో ఒకటి  కాదు లెండీ..  పంద్రాగస్టు గురించి చెప్పాలంటే ఒళ్లు పులకించిపోతోంది లేండి.

ఆగస్ట్ 15 న   మా నందు గాడు చేసే  డాన్స్ గురించి స్కూల్ పిల్లలే కాదు,  ఊరంతా ఆసక్తి ఎదురు చూసేది. అలా ఉండేవి వాడి స్టెప్పులు  AR రెహమాన్ మా తుజె సలాం పాటకు.. ఇదిగో ఈ వీడియో చూశాక.. మా నందుగాడు గుర్తొచ్చాడు నాకు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top