ఆసియా దేశాల్లో మొదటి కెప్టెన్, ప్రపంచవ్యాప్తంగా నెం.1, ఆస్ట్రేలియా లో భారత్ సాధించిన రికార్డు లు…. దుమ్ము రేపిన టీం ఇండియా.!!

ఆస్ట్రేలియా గడ్డపైన ఒక టెస్ట్ సిరీస్ గెలవడం అంటే మామూలు విషయం కాదు, ఒకటి కాదు రెండు కాదు, ఆస్ట్రేలియా గడ్డ పైన టెస్ట్ సిరీస్ లు ఆడటం మొదలు పెట్టినప్పటి నుండి, ఇంత వరకు ఏ ఆసియా దేశం కూడా ఆస్ట్రేలియా లో టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది, కానీ చరిత్ర లో మొదటి సారి భారత్ ఆస్ట్రేలియా లో టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్రను తిరగరాసింది.

దేశానికే మొదటి కెప్టెన్ కాదు, ఆసియా దేశాల్లోనే మొదటి వాడు :

ఆసియా దేశాల్లోనే ఆస్ట్రేలియా లో టెస్ట్ సిరీస్ గెలిచిన ఏకైక దేశంగా టీం ఇండియా రికార్డు సృష్టించింది. ఇంత వరకు ఎవ్వరూ సృష్టించలేకపోయిన సంచలనాన్ని కోహ్లీ సేన సృష్టించింది, ప్రపంచవ్యాప్తంగా నెం.1 టెస్ట్ టీం గా అవతరించింది ఇండియా. ఆసియా దేశాల్లోనే ఆస్ట్రేలియా గడ్డపైన టెస్ట్ సిరీస్ గెలిచిన ఏకైక కెప్టెన్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

అంతా యువకులే కానీ.. :

ఆస్ట్రేలియా టీం ఏవిధంగా అయితే యువకులతో నిండిపోయిందో, ఇండియా టీం కూడా యువకులతో నిండిపోయింది. హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్ తమ దూకుడితో ఆస్ట్రేలియా లో భారత్ విజయానికి దోహత పడ్డారు.

పుజారా కాదు, ది వాల్ అఫ్ ఇండియా బోల్ :

రాహుల్ ద్రావిడ్ లాంటి మరొక టెస్ట్ ప్లేయర్ ఇండియా కు దొరకరు అని అందరు భావించారు. కానీ తన ఆటతో రాహుల్ ద్రావిడ్ నే మరిపించాడు పుజారా, ఆస్ట్రేలియా లో ఇండియా విజయం సాధించడానికి ముఖ్య కారణం పుజారా. 4 టెస్ట్ లలో 521 రన్స్ సాధించాడు పుజారా. మూడు సెంచరీ లు ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయ్ ఇందులో. మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు పుజారా కు దక్కింది.

భారత్ బౌలర్ ల దెబ్బా, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ అన్నారు అబ్బా :

ప్రతి సారి ఆస్ట్రేలియా బౌలర్ లు భారత బ్యాట్సమెన్ లను ఇబ్బంది పెట్టే వారు, కానీ ఈ సిరీస్ లో సీన్ రివర్స్ అయ్యింది. భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు విలవిలలాడారు, ముఖ్యంగా బుమ్రాహ్ ఆస్ట్రేలియా బాట్స్మన్ లకు ఒక పీడకలలాగా మారాడు. జడేజా, ఇషాంత్, షమీ కూడా ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ లను ఒక ఆట ఆడుకున్నారు. కుల్దీప్ అశ్విన్ లు కూడా తగ్గలేదు ఎక్కడ.

ఇండియా కాదు టీం ఇండియా :

ఈ సిరీస్ లో టీం అంతా సమిష్టిగా కృషి చేసింది. రహానే, కోహ్లీ వాళ్ళ అనుభవాన్ని చూపించారు. ఒక్క రాహుల్ ని మినహాయిస్తే, సిరీస్ లో భారత్ కు అన్ని అనుకూల ఫలితాలే లభించాయి అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఆస్ట్రేలియా గడ్డ పైన ఆస్ట్రేలియా ను ఓడించి టెస్ట్ సిరీస్ ని గెలవడం అంటే మాటలు కాదు, ప్రతి ఒక్కరు టీం ఇండియా ను అభినందిస్తున్నారు.

 

 

Comments

comments

Share this post

scroll to top