మీడియా ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ “నారాయణ” కాలేజీ అసలు కథ.! పైకి ఎలా కవర్ చేస్తున్నారంటే.?

విద్యార్థుల‌కు విద్య‌నందించే విద్యాసంస్థ‌లు కావ‌వి. వారి జీవితాల‌తో ఆడుకునే వ్యాపార సంస్థలుగా మారాయవి. చ‌దుకోవాల‌నే త‌ప‌న‌తో విద్యార్థులు వ‌స్తే వారితో చ‌దువును కొనిపిస్తారు. అక్క‌డితో ఆ ప్ర‌హ‌స‌నం ఆగ‌దు. చ‌దువు పేరిట వారిని రాచి రంపాన పెడ‌తారు. ర్యాంకులు, మార్కులే ప‌ర‌మావ‌ధిగా హింస‌కు గురి చేస్తారు. అలాంటి బాధ‌ల‌ను తాళ‌లేక కొంద‌రు విద్యార్థులు త‌మ నిండైన జీవితానికి మ‌ధ్య‌లోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఇప్పుడు మ‌న దేశంలో కార్పొరేట్ విద్యాసంస్థ‌ల్లో జ‌రుగుతున్న తంతే ఇది. అందులోనూ మ‌రీ ముఖ్యంగా మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతే కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ముగిశాయి. విద్యార్థులంతా ఇప్పుడు హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొంద‌రు విద్యార్థుల‌కు మాత్రం చ‌దువు పేరిట కార్పొరేట్ కాలేజీలు న‌ర‌కం చూపిస్తున్నాయి. నిజానికి అది న‌ర‌కం మాత్ర‌మే కాదు, బందిఖానా. జైలు.. వారిని బంధించి మ‌రీ, వారి స్వేచ్ఛ‌ను హ‌రిస్తూ విద్య పేరిట వారిని చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంట‌ర్ విద్యార్థుల‌కు హాలిడేస్ ఇచ్చారు. కానీ కొన్ని కార్పొరేట్ కాలేజీలు మాత్రం మెరిట్ విద్యార్థుల‌ను త‌మ వ‌ద్ద పెట్టుకుని వారికి సెల‌వులు ఇవ్వ‌కుండా త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నాయి.

తాజాగా రావిరాల‌లో ఉన్న నారాయ‌ణ ఐఐటీ క్యాంప‌స్‌లో ఇంట‌ర్ ద్వితీయ సంవత్స‌రం విద్యార్థుల‌ను త‌ర‌గ‌తి గ‌దుల్లో బంధించి మ‌రీ చ‌దువు చెబుతున్నారు. అనేక మంది విద్యార్థుల‌కు సెల‌వులు ఇచ్చారు. కానీ మెరిట్ విద్యార్థుల‌ను మాత్రం కాలేజీ యాజ‌మాన్యం వ‌దల్లేదు. చ‌దువు పేరిట వారికి న‌ర‌కం చూపుతున్నారు. సెలవులు ఇచ్చాక అస‌లు త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించ‌డానికి లేదు. కానీ ఆ కాలేజీ మాత్రం బ‌య‌ట‌కు గ‌దుల‌కు తాళం పెట్టి మ‌రో వైపు లోప‌ల గ‌దుల్లో విద్యార్థుల‌ను బంధించి మ‌రీ చ‌దువు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా చాన‌ల్ ఈ విష‌యాన్ని తాజాగా బ‌య‌ట పెట్ట‌డంతో అస‌లు విష‌యం తెలిసింది.

చాన‌ల్ వారు రాగానే మొద‌ట కాలేజీ సిబ్బంది కాలేజీ మూత ప‌డింద‌ని కావాలంటే లాక్ చేశాం చూడండ‌ని బుకాయించారు. కానీ తీరా లాక్ తెరిపించి చూస్తే గ‌దుల్లో విద్యార్థులు క‌నిపించారు. ఇక దీనిపై మీరే చెప్పండి, ఇలా కాలేజీ యాజ‌మాన్యాల‌ను నిజంగా ఏం చేయాలో..! విద్యార్థుల త‌ల్లిదండ్రులు కూడా ఈ విష‌యం ప‌ట్ల పెద్ద‌గా ఆలోచించ‌క‌పోవ‌డం నిజంగా షాక్‌కు గురి చేస్తుంది. మ‌న దేశంలో కార్పొరేట్ విద్యా సంస్థలు మార‌నంత కాలం విద్యార్థులు ఇలా నిర్బంధంగా బందీలుగా మారి విద్య‌ను చ‌దువుకోవాల్సిందే..! ఏం చేస్తాం.. అంతా మ‌న ఖ‌ర్మ కాక‌పోతే..!

Watch Video :

Comments

comments

Share this post

scroll to top