5 వ త‌ర‌గ‌తి అమ్మాయికి….టీచ‌ర్ వేసిన శిక్ష ఇది.! అబ్బాయిల‌ టాయిలెట్ ద‌గ్గ‌ర స్టాండింగ్ పొజీష‌న్.!!!

స్కూల్ యూనిఫామ్ ధ‌రించ‌కుండా వ‌చ్చింద‌న్న కార‌ణంతో.. 5 వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న అమ్మాయిని బాయ్స్ టాయిలెట్స్ ద‌గ్గ‌ర గంట‌ సేపు నిల‌బ‌డి ఉండాలనే ప‌నిష్మెంట్ ను ఇచ్చాడో టీచ‌ర్.! ఈ సంఘ‌ట‌న తెలంగాణ‌లోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఓల్డ్ MIGలోని రావూస్ ప్రైవేట్ స్కూల్ లో జరిగింది.

స్కూల్ యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్ లో వ‌చ్చిన 5 వ త‌ర‌గ‌తి అమ్మాయిని….ప‌నిష్మెంట్ గా గంట సేపు బాయ్స్ టాయిలెట్స్ ద‌గ్గ‌ర నిల్చోవాల్సిందిగా చెప్పాడు టీచ‌ర్. దీంతో ఆ అమ్మాయి టీచ‌ర్ చెప్పిన‌ట్టే…గంట సేపు అబ్బాయిల బాత్ రూమ్స్ ద‌గ్గ‌ర నిల‌బ‌డింది. త‌న ముందు నుండే అబ్బాయిలు బాత్రూమ్ కు వెళ్ల‌డం, తిరిగిరావ‌డంతో గంట‌సేపు అక్క‌డే త‌లదించుకొని నిల్చుంది ఆ అమ్మాయి.!

తాను చ‌దువుకుంటున్న స్కూల్లోనే త‌న‌కు అవ‌మానం జ‌ర‌గ‌డంతో..మ‌రుస‌టి రోజు స్కూల్ కు వెళ్ళ‌న‌ని..త‌ల్లిదండ్రుల వ‌ద్ద చెప్పింది. అనుమానం వ‌చ్చి కార‌ణ‌మేంటా అని ఆరా తీయ‌గా…అస‌లు విష‌యం బ‌య‌టికొచ్చింది. దీంతో బాలిక త‌ల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచ‌ర్స్ …వ‌క్ర శిక్ష‌లు ఏంటి? అబ్బాయిల టాయిలెట్స్ ద‌గ్గ‌ర అమ్మాయిని నిల్చోబెట్ట‌డంలో ఉద్దేశ్యం ఏంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు స్టూడెంట్స్ పేరెంట్స్ !

స్పందించిన మంత్రి:
ఈ సంఘ‌ట‌న‌పై మంత్రి కెటిఆర్ స్పందించారు. టీచర్ చర్య అమానవీయమన్నారు. ఇలాంటి ఘటన జరగడం మంచిది కాదన్నారు. ఈ ఘటనను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తానని ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు.

 

Comments

comments

Share this post

scroll to top