టాక్సీవాలా మూవీ రివ్యూ..!

AP2TG Staff

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం నేడు విడుదల అయ్యింది. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా విడుదల కావడం తో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.. ప్రియాంక అనే తెలుగు అమ్మాయి ఈ సినిమా లో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. సినిమా విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ నటన, కామెడీ సీన్స్, హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ, మాటే వినదుగ సాంగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు .. గీత గోవిందం అంత రేంజ్ లో లేకపోయినా, విజయ్ గత చిత్రం అయిన నోటా కంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు.

పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ చిత్రంలో నేడు (నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలకు ముందే పైరసీ భూతం ఈ చిత్రాన్ని కమ్మేయడంతో ‘టాక్సీవాలా’కు బ్రేక్ పడినట్టైంది. అయితే చిత్రం మీద ఉన్న నమ్మకంగా ఈ చిత్రాన్ని నేడు థియేటర్స్‌లోకి తీసుకువచ్చారు నిర్మాతలు. విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రంతో రాహుల్‌ సంక్రిత్యాన్‌ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు.

‘గీతా ఆర్ట్ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ మూవీ జర్నలిస్ట్ ఎస్‌.కె.ఎన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనకు ఇదే తొలి చిత్రం.సైన్స్ ఫిక్ష‌న్ కామెడీ థ్రిల్లర్‌గా విజయ్ దేవరకొండ కెరియర్‌లో తొలిసారి ఓ డిఫరెంట్ జానర్ మూవీ చేశారు. విజయ్ దేవరకొండ లుక్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ‘టాక్సీవాలా’ కథకు అనుగుణంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

టాక్సీతో ఎదురైన ఇబ్బందులే ‘టాక్సీవాలా’ కథ :

సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టాక్సీడ్రైవర్‌గా కనిపించారు. బతకుతెరువు కోసం టాక్సీడ్రైవర్‌గా మారిన చదువుకున్న యువకుడి కథే ‘టాక్సీవాలా’. అయితే తానే ఎంచుకున్న వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. టాక్సీతో పాటు ఓ పాసింజర్ వల్ల అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి లాంటి ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రంతో ముగ్గురు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. చిత్ర దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్, చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్, హీరోయిన్ ప్రియాంక జవల్కర్ ముగ్గురూ ‘టాక్సీవాలా’ చిత్రంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ‘మాటే వినదుగా’ అనే సాంగ్ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగితూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్.. సాయి కుమార్ రెడ్డి డైలాగ్స్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

నటీనట : వర్గంవిజయ్ దేవరకొండ,ప్రియాంక జువాల్కర్,మాళవిక.

వర్గం : నాయర్

దర్శకత్వం : రాహుల్‌ సంక్రిత్యాన్‌

శైలి :Thriller

వ్యవధి : 131

రేటింగ్:(3/5)

Comments

comments