చాలా రోజుల తర్వాత “తరుణ్” నటించిన “ఇది నా లవ్ స్టోరీ” హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): ఇది నా లవ్ స్టోరీ (Idi Naa Love Story)

Cast & Crew:

  • నటీనటులు: తరుణ్, ఓవియా తదితరులు
  • సంగీతం: శ్రీనాథ్ విజయ్
  • నిర్మాత: ఎస్.వి.ప్రకాష్
  • దర్శకత్వం: రమేష్-గోపి

Story:

అభిరామ్(తరుణ్) యాడ్ ఫిల్మ్ మేకర్. ఒక యాడ్‌ను షూట్ చేయడానికి అరకు వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. కనిపించినట్లే కనిపించి మాయమైపోతుంది ఆ అమ్మాయి. ఇంతలో తన చెల్లెలు ఒత్తిడి చేయడంతో పెళ్లి చేసుకోవడానికి శృతి అనే అమ్మాయిని కలవడానికి అభి వెళ్తాడు. తను మొదటిచూపులోనే ఇష్టపడ్డ అమ్మాయి, శృతి ఒక్కరే కావడంతో సంతోషపడతాడు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని.. ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. శృతిని అభి ప్రేమించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో తను శృతి కాదని ఆమె స్నేహితురాలు అభినయ(ఓవియా) అని తెలుసుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది..? అభి ప్రేమను అభినయ అంగీకరించిందా..? వీరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి..? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.

Review:

ఐదేళ్ల క్రితం కన్నడలో సూపర్ హిట్ అయిన ‘సింపుల్ ఆగి ఒంధ్ లవ్ స్టోరీ’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కన్నడ సినిమాలో ట్రీట్మెంట్ కొత్తగా ఉండడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాన్స్, కామెడీను మిక్స్ చేసి చక్కగా సినిమాను నడిపించారు. కానీ తెలుగుకు వచ్చేసరికి సినిమా బాగా నిరాశ పరిచింది. సినిమా లైన్ బాగున్నప్పటికీ దాన్ని తెరపై ఆవిష్కరించే విధానంలో తప్పులు దొర్లాయి. ఇక ఓవియా విషయానికి వస్తే…అందాల ఆరబోత మినహా ఏ ఒక్క విషయంలోనూ ఆమె కథానాయిక అనే ఆలోచన కూడా ప్రేక్షకులకు రాదు. దాదాపు ఒక ఎనిమిదేళ్ళ తర్వాత ఒక పూర్తి స్థాయి హీరోగా మళ్ళీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైన తరుణ్ ఈ విధంగా తన నటన పరంగా ఎలాంటి కొత్తదనం చూపించకపోవడం గమనార్హం.


సినిమాలో హీరోకి ఒక లవ్ స్టోరీ, హీరోయిన్‌కు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ రెండు స్టోరీల్లో విషయం ఉండదు సరికదా ఆ ఎపిసోడ్లు మరింత విసిగిస్తాయి. ఇక వీరిద్దరి మధ్య నడిచే ప్రేమకథలో ఒక ఎమోషన్ కానీ, ఫీల్ కానీ ఉండదు. పతాక సన్నివేశాతను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. రెండు పాత్రలను తీసుకొని ఒక్కరోజులో నడిచే కథ అంటూ దర్శకుడు చేసిన ప్రయోగం ఏమాత్రం వర్కవుట్ కాలేదు. సినిమాకు ఇది హైలైట్ అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదు. తెరపై తరుణ్, ఓవియాల జంట సెట్ కాలేదనిపిస్తుంది. వారి మధ్య కెమిస్ట్రీ పండలేదు.

మంచు మనోజ్ చేసిన అతిథి పాత్ర ఆకట్టుకుంటుంది. దర్శకుడు రమేష్ గోపి స్క్రీన్‌ప్లే ఆకట్టుకోదు. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని లొకేషన్స్ ను అందంగా చూపించారు. ఎడిటింగ్ వర్క్ బాగుంది. ఈ మధ్య కాలంలో ఇంత బలహీనమైన ప్రేమకథతో సినిమాలు రాలేదనే చెప్పాలి.

Plus Points:

తరుణ్, ఓవియా నటన
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్
కొంతలో సెకండాఫ్

Minus Points:

కథ, కథనం, డైలాగ్స్
డైరెక్షన్
ఫస్టాఫ్

Final Verdict:

వాలెంటైన్స్ డే రోజు విసిగించే ప్రేమ కథ “ఇది నా లవ్ స్టోరీ”

AP2TG Rating: 1.75 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top