దయ్యాలను మనుషులు బయపెట్టగలిగారా..? “ఆనందో బ్రహ్మ” హిట్టా? స్టోరీ, రివ్యూ & రేటింగ్(తెలుగులో)

Movie Title (చిత్రం): ఆనందో బ్రహ్మ (Anando Brahma )

Cast & Crew:

  • నటీనటులు: తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు
  • సంగీతం: కృష్ణ కుమార్
  • నిర్మాత: విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి
  • దర్శకత్వం: మహి వి. రాఘవ్

Story:

ఒక అనుకోని ఆక్సిడెంట్ లో “రాజీవ్ కనకాల” తల్లితండ్రులు చనిపోతారు. తరవాత అతను తన తల్లితండ్రులు ఉంటున్న ఇల్లుని అమ్మేస్తాడు. తాపీసీ తన తాత, ఒక చిన్న పాపతో కలిసి అదే ఇంట్లో దయ్యాలుగా ఉంటారు. ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయనే పుకారు బయటకి వచ్చేసరికి ఆ ఇంటిని కొనడానికి ఎవ్వరు ముందుకి రాలేదు. ఆ పుకారు తొలగించాలని రాజీవ్ కనకాల ఆ ఇంటిని ఫ్రీ గా అద్దెకు ఇచ్చేస్తాడు. నలుగురు కుర్రాళ్లు అద్దెకు తీసుకోడానికి వస్తారు. ఆ నలుగురిలో ఒకొక్కరికి ఒకో వీక్నెస్ ఉంటుంది. వెన్నెల కిషోర్ చెవిటి మరియు గుడ్డివాడు. షకలక శంకర్ స్ప్లిట్ పర్సనాలిటీ కలవాడు. ఏ సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ లోకి దూరిపోతాడు. తాగుబోతు రమేష్ ఉదయం చాలా సాఫ్ట్ గా ఉంటాడు, సాయంత్రం అవ్వగానే చుక్క పడేసరికి వైయొలెంట్ గా తయారవతుడు. ఇక శ్రీనివాస్ రెడ్డి చాలా తేడా…సంతోషం వస్తే ఏడుస్తాడు, బాధ కలుగుట నవుతాడు. వీరంతా ఆ దయ్యాన్ని ఎలా ఎదురుకున్నారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Review:

కామెడీ హర్రర్ జోనర్‌లో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చినప్పటికీ… ‘‘దెయ్యానికి మనుషులు భయపడతారన్నది మనకు తెలిసిందే. దెయ్యం మనుషులకు భయపడటమన్న కాన్సెప్ట్‌’కొత్తగా ఉందని.. ముఖ్యంగా ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్, శకలక శంకర్, రాజీవ్ కనకాలలు ఫస్టాఫ్ మొత్తం నవ్వుల పూవులు పూయించారని తెలుస్తోంది. దర్శకుడు మహి వి రాఘవ మంచి కాన్సెప్ట్‌నే ఎన్నుకున్నప్పటికీ స్క్రీన్‌ ప్లే కాస్త కన్ఫ్యూజన్‌గా ఉందని తెలుస్తోంది. అయితే తాప్సీ నటన సినిమాకి హైలైట్‌గా నిలిచింది.ఫస్టాఫ్ మొత్తం కామెడీతో బాగానే లాక్కొచ్చినా సెకండాఫ్ నెమ్మదించిందనే టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

Plus Points:

కామెడీ
శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్ యాక్టింగ్
తాప్సి పెర్ఫార్మన్స్

Minus Points:

స్లో సెకండ్ హాఫ్
కథ కొద్దిగా వీక్ గా ఉంది

Final Verdict:

మనుషులకి దయ్యలకి మధ్య జరిగే హారర్ కామెడీ “ఆనందో బ్రహ్మ”. టైం చాలా ఎక్కువ ఉంది, కొద్దీ సేపు నవ్వుకుందాము అనుకుంటే సినిమాకి వెళ్లొచ్చు.

AP2TG Rating: 2. 5 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top