నన్ను ఎందుకు వదిలేసావ్ అని ఫోన్ చేసి అడిగాను?? మొదటి ప్రేమ గురుంచి తెలిపిన తాప్సీ.!!

హీరోయిన్ తాప్సీ తన మొదటి ప్రేమ గురుంచి బయటపెట్టింది, భువనేశ్వర్‌లో ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 అనే కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ తాప్సీ తన తొలి ప్రేమ అనుభవాన్ని పంచుకున్నారు. తాప్సీ మాట్లాడుతూ : నేను 9 వ తరగతిలో ఉన్నప్పుడు ప్రేమ లో పడ్డాను, అప్పటికే బాధ పడేదాన్ని మా ఫ్రెండ్స్ అంత లవ్ లో ఉన్నారు నేనే లేట్ గా లవ్ లో పడ్డా అని బాధ పడ్డా.

అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు .. :

అప్పుడు 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ రాగానే, నన్ను వదిలేసాడు, అంటే నాతో బ్రేక్ అప్ చేసుకున్నాడు. ఇప్పటి లాగా అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, అప్పుడు టెలిఫోన్ బూత్ నుండి తనకి ఫోన్ చేసి నన్ను ఎందుకు వదిలేసావ్ అని ఏడుస్తూ అడిగాను, అప్పట్లో తెలిసి తెలియని వయసు. ప్రస్తుతం అలాగ కాదు, నా ఫోకస్ అంత నా వర్క్ పైనే, నాకు నచ్చిన వాడు దొరకడం కష్టమే, నాది సింహ రాశి కాబట్టి అన్నిట్లోనూ నెం.1 గా నిలవాలని అనుకుంటా, నాకు వచ్చే వాడు కూడా నెం.1 గా ఉండాలి మనసుకు నచ్చాలి అని హీరోయిన్ తాప్సీ తెలిపారు.

టాలీవుడ్ టూ బాలీవుడ్ :

ఇప్పుడు బాలీవుడ్ లో తాప్సీ చాలా బిజీ అయిపోయింది. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ బాలీవుడ్ జనాల్ని ఆకట్టుకుంది తాప్సీ. వైవిధ్యమైన పాత్రలనే కాకుండా కమర్షియల్ పాత్రల్లోనూ నటించగలిగే సత్తా ఉంది తాప్సీకి, తెలుగు లో ఈ భామ కి అవకాశాలు కరువైన బాలీవుడ్ లో మాత్రం మెండుగా ఉన్నాయ్ అవకాశాలు, తెలుగు లో తాప్సీ చివరి చిత్రం నీవెవరో. నీవెవరో సినిమా లో ఆది పినిశెట్టి హీరో గా నటించారు.

 

Comments

comments

Share this post

scroll to top