బీహర్ కు చెందిన 40 ఏళ్ల తాపేశ్వర్ సింగ్ పని కోసం ధర్మశాలకు వెళ్లి అక్కడే సెట్ అయ్యాడు. బంధువుల అమ్మాయి అయిన బబిత ను 3 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. మొదటి ఏడాది బాగానే గడిచింది. అయితే సడన్ గా బబితకు మతి స్థిమితిం కోల్పోయింది, ఎన్ని హాస్పిటల్స్ లో చూపించినా…లాభం లేకుండా పోయింది. మతిస్థిమితంలేని భబితను కంటికి రెప్పలా చూసుకునే వాడు భర్త తాపేశ్వర్. అనుకోకుండా ఓ రోజు బబిత కనిపించకుండా పోయింది. ఊరంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. బంధువులకు వాకబు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో తన భార్య ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయాణం ప్రారంభించాడు తాపేశ్వర్ సింగ్.
సైకిల్ పై బబిత కు సంబందించిన ఫోటోలను పెట్టుకుని తన కోసం ఊరురా వెతకడం మొదలెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు 9 నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఒకనొక దశలో తినడానికి తిండిలేక పోయిన ఎన్ని కష్టాలు ఎదురైనా భార్య కోసం వెతకడం మాత్రం ఆపలేదు. బబిత పోటోను చూసిన ఓ వ్యక్తి ఈ అమ్మాయిని బ్రోతల్ హౌజ్ లో చూసానంటూ చెప్పడంతో తాపేశ్వర్ గుండెలు పగిలిపోయాయి. ఏడుస్తూనే అక్కడి చేరుకున్న తాపేశ్వర్ కు నిరాశే ఎదురైంది. అక్కడ కూడా భార్య కనిపించకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు. అదృష్టమో లేక తన కష్టాన్ని ఆ దేవుడు గుర్తించాడో తెలియదు కానీ ఆ మరుసటి రోజు భబిత రోడ్డు ప్రక్కన చెత్త కుప్ప దగ్గర కనిపించింది. ఒంటిపై చిరిగిన గుడ్డలతో కనిపించిన తన భార్యను చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు తాపేశ్వర్. వెంటనే తేరుకుని తన భార్యను సైకిల్ పై ఎక్కించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ కాలంలో కూడా భార్య మీద ఇంత ప్రేమ, ఆపాయ్యాత, అనురాగాలు కురిపించిన తాపేశ్వర్ సింగ్ ను అందరు ఆదర్శంగా తీసుకోవాలి.