తండ్రి తాగుడుకు బానిసయ్యాడని…కూతురు బెదిరించాలని చూసింది..! చివరికి ఏమైందో తెలుస్తే షాక్.!

ఏటా మధ్యం మత్తులో పడి ఎంత మంది మృత్యువాత పడుతున్నారో..ఎన్ని కుటుంబాలు పెద్దదిక్కులేక రోడ్డున పడుతున్నాయో..అలాంటివారందరూ మధ్యంకి దూరం అయ్యేలా  రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చింది..కానీ చివరికి సొంత తండ్రి చేత మధ్యం మాన్పించాలని ప్లాన్ వేసింది..కాకపోతే అది విఫలమై తనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది…

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం రజక కాలనీకి చెందిన సరస్వతి, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు..వారిలో ఒకరే పదిహేనేళ్ల భార్గవి..తొమ్మిదో తరగతి చదువుతుంది.స్కూళ్లో చురుకుగా ఉండే విధ్యార్దిని భార్గవి..విధ్యార్ధి సంఘం ఎస్ఎఫ్ఐ తో పరిచయం ఏర్పడి తద్వారా ఐద్వా మహిళా సంఘం మధ్యంపై ఇచ్చే వీధినాటికల్లో పాల్గొంటుండేది.సెలవుల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చింది.భార్గవి తండ్రి ఫోటో గ్రాఫర్,తల్లి స్విమ్స్ లో స్వీపర్ గా పనిచేస్తుంది..

తాగుడుకు బానిసైన శ్రీనివాస్ తరుచుగా భార్యతో గొడవ పడేవాడు.చిన్నప్పటినుండి ఇంట్లో జరిగే గొడవలకు తండ్రి తాగుడే కారణమని గుర్తించింది. ఇది చూసిన భార్గవికి మద్యం అంటేనే అసహ్యం పుట్టడం ప్రారంభించింది. మద్యం మానాలని తండ్రికి నచ్చజెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.. తాగుడు మానేయాలని  ఆమె మరోసారి తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా కూడా తండ్రి అంగీకరించకపోవడంతో చివరిగా తండ్రితో మధ్యం మాన్పించే ప్లాన్ వేసింది.

అందులో భాగంగానే తాగుడు మానుతావా, ఎలుకల మందు తాగమంటావా అని తండ్రిని బెదిరించింది భార్గవి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తల్లి ఎలుకల మందు లాక్కుని కింద పడేసింది. అప్పటికే కొంత ఎలుకల మందు భార్గవి నోట్లో పెట్టుకుంది. ఎలుకల మందుతో తాను స్పృహ తప్పుతానని, దాంతో భయపడి తండ్రి తాగుడు మానేస్తాడని ఆమె భావించింది. తాను మందు తిన్న విషయాన్ని  వెంటనే తల్లిదండ్రులకు చెప్పలేదు. దాంతో  అస్వస్థతకు గురైన భార్గవిని హాస్పటల్ కి తీసుకెళ్లారు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.మూడురోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలోదిలింది ఆ చిన్నారి.ఇప్పటికైనా ఆ తండ్రి మద్యం వదులుతాడో లేదో… .

Comments

comments

Share this post

scroll to top