త‌న స్త‌నాల‌ను ప్రెస్ చేసి పారిపోతున్న వ్య‌క్తికి ఊహించ‌ని రీతిలో బుద్ది చెప్పిన యువ‌తి.!!? #వాస్త‌వ సంఘ‌ట‌న‌.

ఎప్ప‌టి లాగే ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని పాట‌లు వింటూ న‌డుచుకుంటూ ఇంటికి వెళుతున్నాను. ఎదురుగా ఓ కుర్రాడు న‌న్నే చూస్తూ, వెకిలి న‌వ్వు న‌వ్వుతున్నాడు. నా డ్ర‌స్ ను ఓసారి చెక్ చేసుకున్నాను, ఏదైనా తేడాగా ఉందేమోన‌ని..? నా డ్రెస్ లో కాదు వాడి చూపులోనే తేడా అనుకొని మ‌రింత వేగంగా ముందుకు క‌దులుతున్నాను…ఇంత‌లోనే అత‌డు వేగంగా నా ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి నా రెండు స్త‌నాల‌ను అత‌ని రెండు చేతుల్లోకి తీసుకొని బ‌లంగా ప్రెస్ చేసి…అంతే వేగంగా ప‌రిగెత్తుతున్నాడు.

నేను ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యా….20 సెకెండ్స్ వ‌ర‌కు స్పృహ త‌ప్పిన‌ట్టైంది. వెంట‌నే తేరుకున్నా…హేయ్ థాంక్స్ యూ వెర్రీ మ‌చ్, ఐలైక్ ఇట్ అని గ‌ట్టిగా అరిచాను. అది విన్న అత‌డు ఆశ్చ‌ర్య‌పోయాడు. రియ‌ల్లీ అని అన్నాడు..య‌స్, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, ఇదో కొత్త అనుభూతిలా ఉంద‌న్నాను…ఇది విన్న అత‌ను క్ష‌ణం ఆలోచించ‌కుండా వెంట‌నే నా ద‌గ్గ‌రికి వ‌చ్చాడు.

నా ద‌గ్గ‌రికి వ‌చ్చిన అత‌ని సంక‌ల్లో నా రెండు చేతులు పెట్టి ప‌ట్టుకున్నాను, కౌగిళించుకుంటుందేమో అనుకున్నాడత‌ను…అదే అదునుగా చూసి నా మోకాలిని వంచి అత‌డి సెంట‌ర్ పాయింట్ పై గ‌ట్టిగా ఒక్క‌టిచ్చా… అప్ప‌టి వ‌ర‌కు కామంతో ఉడికిపోయిన అత‌డి ఫేస్… రెడ్ కాల‌ర్ లోకి మారిపోయింది. దీని నొప్పి అక్క‌డ రిఫ్లెక్ట్ అవుతున్న‌ట్టు క‌నిపించింది. సెంట‌ర్ పాయింట్ ను ప‌ట్టుకొని కింద ప‌డి గిల‌గిల కొట్టుకుంటున్నాడు. మ‌ళ్ళీ ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని పాట‌లు వింటూ నేను మా ఇంటివైపుగా న‌డుస్తున్నాను.

Comments

comments

Share this post

scroll to top