తన పిల్లల్ని తను పనిచేసే స్కూల్లో చేర్పించిన ప్రభుత్వ టీచర్.

గ్రామస్థుల పిల్లలు ప్రభుత్వ బడులల్లో, ఆ బడిపంతుల్ల పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లోనా? ఇదెక్కడి న్యాయం? వారు చెప్పే చదువుపై వారికే నమ్మకం లేదా? అనే ప్రశ్నల పరంపరకు… ఈ ప్రభుత్వ టీచర్ వేసిన ఆదర్శనీయమైన అడుగే ఓ సమాధానం.ఒక గవర్నమెంట్ టీచర్ గా.. నా స్కూల్ లో చెప్పే చదువుపై నాకే నమ్మకం లేకపోతే… … ఇక సర్కారీ స్కూల్స్ ను ప్రజలెలా నమ్ముతారు? అని తన సొంత పిల్లలను తను పనిచేస్తున్న స్కూల్లో చేర్పించి…. ప్రజలలో ప్రభుత్వ బడుల పట్ల ఓ నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వ టీచర్.

IMG-20160615-WA0017

నల్గొండ జిల్లాకు చెందిన ఈ టీచర్ పేరు ఏడుకొండలు…తన ఇద్దరు పిల్లలు  అహల్య, అమూల్యను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు ఈ మాస్టార్.  అంతేకాదు ఆ టీచర్  పిల్లలు ఫస్ట్ నుండి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు… క్లాస్ లో కూడా ఎప్పుడూ ఫస్టే వస్తారు. ప్రభుత్వ స్కూల్ లో చదివిన వారి పెద్ద అమ్మాయి మోడల్ స్కూల్ ప్రవేశ అర్హత కూడా  సాధించింది.

IMG-20160615-WA0018

టీచర్ అంటేనే..ఓ నమ్మకం, అందుకే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల తర్వాత అంతగా నమ్మేది ఉపాధ్యాయుడినే. ప్రభుత్వ బడుల పట్ల ఆ నమ్మకాన్ని తల్లిదండ్రులలో కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులదే. సర్కారీ స్కూల్స్ లో నాణ్యమైన విద్య దొరుకుతుందనే సంపూర్ణ భరోసా పేరెంట్స్ కు ఇవ్వగలిగితే చాలు వారు కూడా తమ పిల్లల అడ్మీషన్ కోసం సర్కారీ స్కూల్స్ ముందు క్యూలు కడతారు. అదే పనిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఈ ఉపాద్యాయుడిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను ప్రభుత్వ బడులల్లో చేర్పించి సర్కారీ స్కూల్స్ పట్ల నమ్మకాన్ని పెంపొందిస్తే బాగుంటుంది.

IMG-20160615-WA0021

నేడు ప్రభుత్వ బడులు విద్యార్థుల్లేక అనాథలుగా మారడానికి ప్రధాన కారణం సర్కారీ స్కూల్స్ పై ప్రజలకు నమ్మకం లేకపోవడమే.. ఆ నమ్మకం కల్గించడానికి అందమైన అర డజన్ మాటల కన్నా… ఆచరిస్తూ వేసిన ఒక్క అడుగే జనాల్లో చైతన్యాన్ని తీసుకొస్తుంది. అలాంటి ప్రయత్నం చేసిన ఈ ఉపాధ్యాయుడికి అభినందనలు.

Comments

comments

Share this post

One Reply to “తన పిల్లల్ని తను పనిచేసే స్కూల్లో చేర్పించిన ప్రభుత్వ టీచర్.”

  1. Rambabu Valiveti says:

    abhinandanalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top