పెళ్లికి అయ్యే ఖర్చుతో…108 మంది పేదలకు ఇళ్లు కట్టించిన పెళ్లికూతురు.!

తన పెళ్లిని సాదారణంగా చేసుకొని, పెళ్లికి అయ్యే ఖర్చుతో…..108 మంది నిరుపేదలకు  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించ్చింది ఓ నూతన వధువు.  మహారాష్ట్ర కు  చెందిన శ్రేయ మునోద్ ది బాగా డబ్బున్న కుటుంబం.ఆమె అత్తింటి వాళ్లు కూడా శ్రీమంతులే! దీంతో తన పెళ్లిని తరతరాలు గుర్తుండిపోయేలా చేసుకోవాలని ఆలోచించిన శ్రేయ…..తన పెళ్లికి ఖర్చు చేయాల్సిన డబ్బుతో 108 ఇళ్లను ప్రారంభించిది. అందులో ఆమె పెళ్లినాటికి 90 ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించబడ్డాయి.

daughter-1

గుర్తించిన నిరుపేదలను ….తన పెళ్లికి ప్రత్యేక అతిథులుగా  పిలిచి, కొత్త ఇంటి తాళాలను వారి చేతికందించింది శ్రేయ. మిగిలిన 18 ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి, వాటిని కూడా నిరుపేదలకు ఇచ్చే ఆలోచనలో ఉంది ఈ నూతన వధువు. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని చూస్తున్న ఈ రోజుల్లో….ఈ నూతన వధువు ఆలోచన నిజంగా అభినందనీయం. ఈమె నిర్ణయాన్ని భర్తతో సహా…అత్తింటి వారు కూడా స్వాగతించారు. ఇళ్ళను కానుగా పొందిన వారు….నూతన వధూవరులను తమ కొత్త ఇండ్లలోకి ఆహ్వానించి సన్మానించారు.

గాలి జనార్థన్ రెడ్డి కూతురి పెళ్లి కంటే శ్రేయ మునోద్ వివాహం నాకంటికి వేయి రెట్లు  గొప్పది. ఆట, పాట ,అట్టాహాసాలకు కోట్లు ఖర్చు పెట్టిన గాలి జనార్థన్ రెడ్డి  ఈ మేరకు ఆలోచించి ఉంటే….కనీసం ఓ 5000 ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వొచ్చు.

#HatsOff….శ్రేయ

Comments

comments

Share this post

scroll to top