తన పెళ్లినాటి పరిస్థితులను వివరించిన పాక్ యువతి. ఆమె ధైర్యానికి సలాం.

ఇది ఓ పాకిస్థాన్ యువతి మనోగతం…. తన చిన్నతనంలో వచ్చిన పెళ్లి సంబంధాన్ని కాదని, తల్లిదండ్రులను ఎదిరించి…కట్టుబాట్ల సమాజాన్ని ఎలా ఎదర్కొందో క్లుప్తంగా చెప్పుకుంది. ఆమె చెప్పింది చెప్పినట్లుగా  తెలుగు అనువాదం మీకోసం.

అప్పుడు  మా వయస్సు రమారమి ఏడేళ్లు…మా స్నేహితురాలి పెళ్లి జరుగుతుంది. మాకు వివాహ వేడుకంటే చాలా ఇష్టం. రంగురంగుల బట్టలు ధరించడం..పంక్తి భోజనాలు.చుట్టాలు, పక్కాలతో ఇళ్లంతా కోలాహలంగా ఉంటుంది కాబట్టి..అందులోనూ అవుతుంది మా ప్రెండ్ పెళ్లి కావడంతో మరింత ఆనందంతో ఉన్నాం మేమంతా…  మా స్నేహితురాలిని ఉన్న ఊరిలోనే ఇవ్వడంతోనే….రోజూ మేము వారింటికి వెళ్లి మా ఫ్రెండ్ తో ఆడుకునేవాళ్లం…మొదట్లో బాగానే ఉన్న మా ఫ్రెండ్ వాళ్ల అత్త…తర్వాతర్వాత మమ్మల్ని తిట్టడం స్టార్ట్ చేసింది..చివరకు మమ్మల్ని వారి ఇంటికి రావద్దని తెగేసి చెప్పింది. అలా చెప్పింది మొదలు సుమారు 6 నెలల వరకు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు..మా ఫ్రెండ్ ను కూడా….

చివరకు ఓ రోజు మా స్కూల్  ఫంక్షన్ ఉండడంతో ఆ ఫంక్షన్ కు మేమంతా వెళ్లాం..పెళ్లైన మా ఫ్రెండ్ కూడా వచ్చింది. చాలా రోజుల తర్వాత కలిసింది కాబట్టి ఆమెతో మాటలు కలిపాం..మాట్లాడుతుంటే ఆమె మోచేతి మీద వాతలు కనిపించాయ్…ఎంటి ఈ వాతలు అంటే…. ఎడ్చుకుంటూ చెప్పుకొచ్చింది సోనూ…మా ఆయన నన్ను ఐరన్ వైర్ తో కొట్టాడు, అత్త కూడా రోజూ కొడుతుంది. ఇంటిపని మొత్తం నాతోనే చేయిస్తున్నారంటూ చేతులు చూపించింది…వాటికంతా బొగ్గలొచ్చాయి. చాలా బాధేసింది ఆమె పరిస్థితి విన్నాక.!

Humans-of-Pakistan-750x500

వాతలతో నిండిన మా ఫ్రెండ్ మోచేతులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయ్…. అలా మూడేళ్లు గడిచాయ్. మా నాన్నమ్మ, అమ్మానాన్న నా దగ్గరికి వచ్చి… ఓ మంచి సంబంధం వచ్చింది నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామని అన్నారు. అప్పుడు నా వయస్సు 11 యేళ్లు… పెళ్లి అనే పదం వినిపించగానే నాకు మా ఫ్రెండ్ గుర్తొచ్చింది. లేదు నేను చేసుకోను అని తెగేసి చెప్పాను.అయినా సరే నువ్వు చేసుకోవాల్సిందే మంచి సంబంధం అంటూ ఇంటోళ్ల  ఫోర్స్ ఎక్కువైంది. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా ప్రయత్నించా…చివరకు లాయర్ అయిన మా అంకుల్ దగ్గరికి వెళ్లా…అతను ఇంట్లో చెప్పడానికి ట్రై చేశాడు. కానీ మా వాళ్లు ఆయన మాట కూడా వినలేదు.

ఈ పెళ్లి నాకు ససేమీరా ఇష్టం లేదని మా అంకుల్ తో చెప్పాను. అతను బాల్య వివాహ నిరోదక చట్టాల గురించి వివరించాడు.  ఆ చట్టాల వివరాలన్నీ తెలుసుకున్నాక…నేను ఇంటికి వెళ్లా…నన్ను పెళ్లికి బలవంతం చేస్తే…కేసు పెట్టడానికి కూడా వెనుకాడనని చెప్పేసా..చట్టాల గురించి వారికి వివరించా…. అది మొదలు…. మా ఊరిలో ఎక్కడ బాల్యవివాహాలు జరిగితే అక్కడికి వెళ్లి వారికి చట్టాల గురించి చెప్పి, పోలీసులకు సమాచారం అందించే దాన్ని…అలా బాల్య వివాహాల నివారణ కు ఓ NGO ను స్థాపించా….. పెళ్లి అనేది ఇష్టపూర్వకంగా జరగాలి కాని, వేలంపాట వేసినట్టు…ఎవరికి పడితే వారికి అంటకట్టొద్దే అనేదే నా మోటో.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top