త‌న యావ‌దాస్తిని హీరో పేరు మీద రాసి చ‌నిపోయిన మ‌హిళ‌.!?

ముంబైకి చెందిన నిషి త్రిపాఠి అనే 62 సంవ‌త్స‌రాల మ‌హిళ‌…త‌న యావ‌దాస్తి..త‌న ఇష్ట‌మైన హీరో సంజ‌య్ ద‌త్ కు చెందేలా వీలునామా రాసి చ‌నిపోయింది. ఆమె ఖాతాలో ఉన్న నగదుతో పాటు లాకర్‌లో ఉన్న విలువైన వస్తువులు సంజయ్‌ దత్‌కు దక్కేలా మరణించడానికి కొన్ని నెలల క్రితమే ఈ వీలునామా రాసినట్లు తేలింది. బ్యాంకు అధికారుల ద్వారా ఈ విష‌యం తెలుసుకున్న సంజయ్‌ షాక్‌కు గురయ్యారు. తనపై ఆమెకున్న అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆ ఆస్తిని తీసుకోవడానికి అంగీకరించలేదు. ఆమె కుటుంబ సభ్యులకే ఆ ఆస్తి చెందేలా చేయడానికి బ్యాంక్ అధికారుల‌కు సహకారం అందిస్తాన‌న్నారు.!

Comments

comments

Share this post

scroll to top