తమ్ముడు కావాలా ? చెల్లి కావాలా ? వాట్సాప్ లో వైర‌ల్ అవుతున్న మెసేజ్.!

ఒక గర్భవతి అయిన స్త్రీ తన కూతురుకి తమ్ముడు కావాలా ? చెల్లి కావాలా ? అని అడిగింది
కూతురు: తమ్ముడు కావాలి
తల్లి: ఎలాంటివాడు కావాలి
కూతురు: రావణుడు లాంటి వాడు కావాలి
తల్లి: ఏంటి నువ్వు మాట్లాడుతుంది ? నీకు ఏమైనా మతి పోయిందా ?
కూతురు: రావణుని లాంటి వాడు అయితే ఏమైందమ్మా ?
అతడు తన చెల్లిని అగౌరపరిచారని బంధాల్ని,చివరకి రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు.
శత్రువు భార్యని కూడా ఎత్తుకొచ్చాడు,కానీ కనీసం తాకలేదు
నేను రావణుడి లాంటి తమ్ముడిని ఎందుకు కోరుకోకూడదు
పోనీ రాముడి లాంటి తమ్ముడిని ఎందుకు కోరుకోవాలి
ఎప్పుడూ తన నీడలా పక్కనే ఉండే భార్యని గర్భవతి అని కూడా చూడకుండా ఒక రజకుడి మాట విని అగ్ని పరీక్ష పెట్టాడు
14 సంవత్సరాలు వనవాసానికి తీసుకెళ్లి అష్టకష్టాలు పడేటట్లు చేశాడు
అందుకా…?
ఇప్పుడు చెప్పు అమ్మ నీకు రాముడు కావాలా? రావణుడు కావాలా?
రాముడికి భార్యగా ఉంటావా ? రావణుడికి చెల్లిగా ఉంటావా ?
ఇప్పటికీ రాముడే కొడుకుగా పుట్టాలి అనుకుంటున్నావా ?
తల్లి కళ్ళల్లో నీళ్ళు చెమర్చాయి
నీతి: ప్రపంచం లో ఎవరూ చెడ్డవాడు కాదు అలా అని మంచివాడు కాదు
మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోమని చెప్పడమే ఈ కథా సారాంశం
గుడికి వెళ్లిన ప్రతివాడు గుణవంతుడు కాదు
పబ్కి వెళ్లిన ప్రతివాడు వెధవా కాదు
జీవిత సత్యం
గుడి చాలా ఆశ్చర్యకరమైన స్థలం
ఎందుకంటే
పేదవాడు గుడికి బయట అడుక్కుంటాడు
ధనవంతుడు గుడి లోపల అడుక్కుంటాడు

Comments

comments

Share this post

scroll to top