ఆమె వ‌చ్చింది- త‌మ్ముడు దారి త‌ప్పాడు- వ్యాపారం న‌ష్టాల్లోకెళ్లింది: స‌లహా ప్లీజ్.!!!

రామ‌లక్ష్మ‌ణుల‌కు జిరాక్స్ కాపీల్రా అనేవాళ్లు మా బంధువులు…నన్ను నా త‌మ్ముడి అన్యోన‌త‌ను చూసి., కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు.నా త‌మ్ముడి భార్య మా ఇంట్లో ఎంట‌ర్ అయ్యాక అంతా త‌ల‌కిందులైంది.! ఇప్పుడు వాడే నా మీద‌కు కాలుదూస్తున్నాడు.!! భార్య మాట‌లు వింటూ న‌న్నే ప‌రాయివాడిగా ట్రీట్ చేస్తున్నాడు.! మా విష‌యానికి వ‌స్తే….  తాత‌ల కాలం నుండి మాకు చాలా పొలం ఉండేది. రియ‌ల్ ఎస్టేట్ భూమ్ వ‌చ్చిన‌ప్పుడు వాటిని అమ్మేశాం..దాంతో ఇంటి నిండా డ‌బ్బులొచ్చేశాయ్…ఈ క్ర‌మంలో అన్నాద‌మ్ములిద్ద‌రం ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకున్నాం..ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని ప‌క్కా ప్లాన్ వేసుకున్నాం. నాన్న గారి గైడెన్స్ తో … మా టౌన్ లో ఒక‌టి, ..హైవే పై మ‌రొక‌టి ఇలా రెండు పెట్రోల్ బంక్స్ పెట్టాము.! ఇంకో ఫ‌ర్నీచ‌ర్ షాప్, ఓ షాపింగ్ మాల్ పెట్టేశాం! బంక్ ల వ్య‌వ‌హారం త‌మ్ముడు మిగితా వాటిని నేను చూసుకుంటూ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నాం. షాపుల‌న్నీ లాభాల్లో న‌డుస్తున్నాయ్…ఇక అంతా సెట్ అయ్యిందని ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో…నాన్న నేను ఈ అమ్మాయిని ల‌వ్ చేశా…ఈమెనే పెళ్లి చేసుకుంటాన‌ని ఓ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు.! అమ్మ కాస్త ముభావంగా ఉన్నా….నేనే స‌ర్ది చెప్పా…అంద‌ర్నీ ఒప్పించా…ఫైన‌ల్ గా వాళ్ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా చేశా…. బ‌ట్ త్రీ మంథ్స్ లోనే మ్యాట‌ర్ రివ‌ర్స్ అయ్యింది. మా వాడు పెట్ర‌లో బంక్ ల‌కు వెళ్ల‌డ‌మే మానేశాడు. ఆ అమ్మాయి త‌మ్ముడిని ఆ పెట్రోల్ బంక్స్  మేనేజ‌ర్ గా చేశాడు.త‌మ్ముడు సినిమాలు,షికార్లుల‌కు అలవాటు ప‌డ్డాడు. ఎక్కువ‌గా అత్త‌గారింట్లోనే ఉండడం స్టార్ట్ చేశాడు.!

రెండేళ్ల‌లోనే….రెండు పెట్రోల్ బంక్ లు దివాళా తీశాయి.! అంతేకాక‌..బ‌య‌ట చాలా అప్పులు చేశాడు మా త‌మ్ముడు.! లాభాలొచ్చే బిజినెస్ లు నువ్వు తీసుకొని, న‌ష్టాలు తెచ్చే బిజినెస్ లు నాకిచ్చావ్ అంటూ నాతో వాద‌న‌కు దిగాడు.! ఇంట్లో కూడా తమ్ముడి భార్య మా పేరెంట్స్ తో గొడ‌వ పెట్టుకుంటుంది…మీకు పెద్ద కొడుకంటేనే ఇష్టం..మా ఆయ‌న‌ను ప‌ట్టించుకోట్లేదని ప్ర‌తిరోజూ గొడ‌వ! నేనేమో నా కుటుంబం, నా త‌మ్ముడు అంటూ నా చిన్న చిన్న స‌ర‌దాలు సైతం వ‌దులుకొని వ్యాపారాల‌ను అభివృద్ది చేశాను. ఇప్పుడేమో ఈ బిజినెస్ లు మొత్తం నావే అని నా మీదే కేసు వేశాడు నా త‌మ్ముడు.! నాకు ఆస్తులొద్దు, అంత‌స్తులొద్దు…నా త‌మ్ముడు నేను క‌లిసుంటే చాలు.!! మంచి స‌ల‌హా ఇవ్వండి ప్లీజ్.!!

Comments

comments

Share this post

scroll to top