బైక్ / స్కూటీ కొనే మహిళలకు 50 % డిస్కౌంట్ అన్నారు…కానీ ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ పెట్టిందో తెలుసా.?

త‌మిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి, స్వర్గీయ జ‌య‌ల‌లిత బ‌తికి ఉన్న‌ప్పుడు అనేక జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌జ‌ల మ‌నస్సుల్లో విశిష్ట‌మైన స్థానం సంపాదించారు. అమ్మ క్యాంటీన్ మొద‌లుకొని అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని త‌మ వైపు తిప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆవిడ లేక‌పోయినా ఆ పార్టీకి చెందిన నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు మాత్రం అమ్మ పేరిట ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు తాజాగా ఓ కొత్త ప‌థ‌కాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదేమిటంటే…

త‌మిళ‌నాడులో ఇక‌పై మ‌హిళ‌లు టూ వీల‌ర్ కొంటే అందులో 50 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. అమ్మ టూ వీల‌ర్ పేరిట ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఉన్న విధంగానే ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన జ‌యల‌లిత 70వ జ‌యంతి సంద‌ర్భంగా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్నారు. కాగా 18 నుంచి 40 సంవ‌త్స‌రాల వ‌యస్సు మ‌ధ్య ఉన్న మ‌హిళ‌ల‌ను ఈ ప‌థ‌కానికి ల‌బ్దిదారులుగా నిర్ణ‌యించారు.

త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించనున్న అమ్మ టూ వీల‌ర్ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది పొందే మ‌హిళ‌లు రూ.2.50 ల‌క్ష‌ల లోపు ఆదాయం క‌లిగి ఉండాలి. ఇక 125 సీసీ లోపు ఉన్న స్కూట‌ర్లు, మోపెడ్ల‌ను కొంటేనే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ఈ క్ర‌మంలో టూ వీల‌ర్ కొనే మ‌హిళ‌ల‌కు వాహ‌న ధ‌ర‌లో 50 శాతం చెల్లిస్తారు. లేదంటే రూ.25వేల వ‌ర‌కు రాయితీని అందిస్తారు. కాగా కుటుంబ పోష‌ణ భారం నిర్వ‌హించే వితంతు, దివ్యాంగ మ‌హిళ‌లు, హిజ్రాల‌కు ఈ ప‌థ‌కంలో అధిక ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌నున్నారు. అయితే ఒక కుటుంబానికి ఒక వాహ‌నానికి మాత్ర‌మే ఇలా రాయితీ ఇస్తారు. ఏది ఏమైనా త‌మిళనాడు రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేయనున్న ఈ ప‌థ‌కంతో ఎంతో మంది మ‌హిళ‌ల‌కు నిజంగానే ల‌బ్ది చేకూరుతుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top