ఈ హీరో తో మాత్రమే లిప్ లాక్ సీన్ లో నటిస్తా అంటున్న తమన్నా..

తెలుగు తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన తమన్నా, అందాల ఆరబోతలో అస్సలు తగ్గదు, కానీ లిప్ లాక్ సీన్లు అంటే నో అంటుంది, నటన పరంగా డాన్స్ పరంగా ఈ అమ్మడు పూర్తి న్యాయం చేస్తుంది, నటన పరంగా కొన్ని సినిమాల్లో ఎక్కువ న్యాయం చేసిందనుకోండి. శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, అసలైన బ్రేక్ మాత్రం హ్యాపీ డేస్ సినిమా నే, ఆ తరువాత వరుసపెట్టి సినిమాల్లో నటించింది. అతి తక్కువ సమయం లోనే తెలుగు టాప్ హీరోలతో నటించిన భామ గా గుర్తింపు పొందింది.

ఆ ఒక్క హీరో తో మాత్రమే.. :

ఇటీవలే F2 సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది తమన్నా. F2 సినిమాలో అందాల ఆరబోతలో లోటుపాట్లు లేకుండా చూసుకుంది, అయితే కేవలం అందాల ఆరబోత అయితే ఓకే కానీ, లిప్ లాక్ సీన్స్ అంటే అన్ని సినిమాల్లో, అందరి హీరోలతో చెయ్యనని చెప్పేసింది, కానీ ఒక్క హీరో తో అయితే లిప్ లాక్ సీన్ చెయ్యడానికి అభ్యంతరం లేదని తెలిపింది, ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. హృతిక్ అంటే తమన్నా కి విపరీతమైన పిచ్చి అని ఆమె పలు సందర్భాల్లో తెలిపింది కూడా..

మాట రాలేదు.. :

తమన్నా ని చూస్తే తమన్నా అభిమానుల నోటి వెంట వెంటనే మాట రాదు, ఆమె అందం అటువంటిది, అలాంటిది ఆమె మరొకరిని చూసాక ఆమె నోటి వెంట మాట రాలేదు, కొన్ని రోజుల క్రితం ఆమె హృతిక్ రోషన్ ని కలిశారు, హృతిక్ ని చుసిన వెంటనే ఆమె నోటి వెంట మాట రాలేదు, తరువాత హృతిక్ రోషన్ దెగ్గరికి వెళ్లి ‘నేను మీకు పెద్ద అభిమాని అని’ తమన్నా హృతిక్ తో తెలిపింది. అభిమానం ఎక్కువైతే నోటి వెంట మాట రాదు అనడానికి హీరో హీరోయిన్లు కూడా మినహాయింపు కాదు. హృతిక్ రోషన్ తో కలిసి ఒక్క సినిమా లో అయినా నటించాలనేది తమన్నా కోరిక. మరి తమన్నా కోరిక తీరుతుందో లేదో వేచి చూడాలి, ప్రస్తుతం కెప్టెన్ మార్వెల్ మూవీ ని ప్రమోట్ చేస్తూ బిజీ బిజీ గా ఉంది తమన్నా.

Comments

comments

Share this post

scroll to top