“జై లవకుశ” ఐటెం పాటకు “తమన్నా” ఎంత తీసుకుందో తెలుసా.? అంతకముందు రెమ్యూనరేషన్ ఎంతంటే.!

ఐటెం సాంగ్ అనగానే ఒకప్పుడు జయమాలిని,జ్యోతి లక్ష్మి గుర్తొచ్చేవారు..తర్వాత సిల్క్ స్మిత కూడా వారి రేంజ్ లోనే పేరు సంపాదించుకుంది..ఈ మధ్యకాలంలో ఆ ప్లేస్ ని ముమైత్ ఖాన్ భర్తీ చేసింది..అడపాదడపా ముంబై ముద్దుగుమ్మలతో   ఐటెం సాంగ్స్ చేయించినా కూడా ఎక్కువ క్లిక్ అయింది ముమైతే..కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో నర్తించడానకి సై అంటున్నారు.దీనికి ఒక కారణం సిని పరిశ్రమలో వారికి ఉన్న సంబంధాలు,మరొకటి భారీ పారితోషికాలు..

శ్రేయ,శృతి హాసన్,కాజల్ అగర్వాల్,పార్వతి మెల్టన్ ,తమన్నా ఒకరి తర్వాత ఒకరు అందరు హీరోయన్లు ఐటమ్ సాంగ్స్ కి పచ్చజెండా ఊపుతున్నవారే.ఒకప్పుడు ఐటెం సాంగ్ చేసినవారికి కూడా ఆ సినిమాలో ఏదో రోల్ ఉంటుంది.అందులో భాగంగగానే పాట కూడా వచ్చేది ,కానీ ఇప్పుడు వీటిని స్పెషల్ సాంగ్స్ అంటున్నారు.అంటే ఆ పాటలో అలా వచ్చి ఇలా మెరిసి మాయమైపోతుంటారన్నమాట..మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే మసాలా సాంగ్ తప్పనిసరి అనేది ఫిలిం మేకర్స్  ఆలోచన..ఎన్జీఆర్ సినిమా జనతా గ్యారేజ్ లో నేను పక్కా లోకల్ అంటూ ఆడిపాడింది కాజల్ అగర్వాల్..ఇప్పుడు జైలవకుశలో తారక్ తో స్పెషల్ సాంగ్ లో నర్తించింది మిల్కీ బ్యూటీ తమన్నా..ఈ పాట  కోసం భారీగానే పారితోషికాన్ని వసూలు చేసింది.

watch video:

ఇంతకుముందు బెల్లంకొండ శ్రీనివాస్ తో కూడా స్పెషల్ సాంగ్ లో నటించింది తమన్నా.ఇప్పుడు రెండోసారి స్వింగ్ జరా అంటూ ప్రేక్షకుల ముందుకొస్తుంది.దీనిలో నటించడానికి తమన్నా పెద్దమొత్తంలో తీసుకుందనే టాక్ వినిపిస్తుంది..ఇంతకు అమ్మడు తీసుకున్న అమౌంట్ ఎంతో తెలుసా అక్షరాల యాబై లక్షలు..దీనిగురించి తమన్నా దగ్గర ప్రస్తావిస్తే “ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు. అతడితో కనిపించే అవకాశం వస్తే డబ్బుల గురించి ఆలోచిస్తానా?” అని సెంటిమెంట్ తో కొట్టింది.

గతంలో స్పీడున్నోడు,అల్లుడు శీను లో స్పెషల్ సాంగ్స్  కి అరవై లక్షలు తీసుకుంది తమన్నా.అప్పుడంటే బెల్లంకొండ శీనుఅప్ కమింగ్ హీరో తమన్నా స్పెషల్ అప్పియరెన్స్ సినిమాకి హెల్ప్ అవుతుందని అంత పెద్ద అమౌంట్ ఇచ్చుండొచ్చు..ఇప్పుడు స్వింగ్ జరా లో అంత అమౌంట్ ఇచ్చి చేయించడానికి రీజన్ సినిమా చూసిన ప్రేక్షకులే చెప్పాలి ఆ సాంగ్ లో అంత స్పెషల్ ఏముందో…

Comments

comments

Share this post

scroll to top