ఐపీఎల్ లో నిమిషం డాన్స్ చేస్తే…”తమన్నా” ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా.?

Krishna

ఐపీఎల్ 2018 సందడి స్టార్ట్ అయింది..నేటి నుండి ప్రతి ఇంట్లో టివిలు క్రికెట్ కామెంటరీతో మోత మోగాల్సిందే..  ఈ సీజన్ (తెలుగు) కి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవ వేడుకలో మన మిల్కీ బ్యూటి తమన్నా తన డ్యాన్స్ ఫెర్పార్మెన్స్తో అదరగొట్టింది..పదినిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శనకు తమన్నా ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా…?

ఒకవైపు సినిమాల్లోనే కాదు స్పెషల్ సాంగ్స్లో కూడా తన సత్తా చాటుతుంది తమన్నా..చేసేది ఒక పాటే అయినా రెమ్యునరేషన్ మాత్రం భారీగానే తీసుకుంటుంది..తమన్నా డ్యాన్స్ అదరగొడుతుంది కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా వెనక్కి తగ్గడం లేదు..ఈ ఏడాది ఐపిఎల్ ఓపెనింగ్ వేడుకలో డ్యాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది తమన్నా.గత ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలో పరిణీతి చోప్రా,దిశా పటాని పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో మిల్కీ బ్యూటీ  తన స్టెప్పులతో అదరగొట్టింది. ఇందుకోసం తమన్నా భారీ పారితోషికం అందుకున్నట్లు టాక్. పది నిముషాల నృత్య ప్రదర్శనకు అరకోటి రూపాయలను తీసుకున్నట్టు సమాచారం.

ఇది ఒక సినిమా లో స్పెషల్ సాంగ్ చేయడానికి తీసుకునే రెమ్యునరేషన్ తో సమానం.గతంలో జై లవకుశలో “స్వింగ్ జరా” పాటకు ఇంతే మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంది తమన్నా అక్కడ ఐదు రోజుల పాటు కష్టపడితే ఇక్కడ కొన్ని గంటలు కష్టపడితే సరిపోతుంది. నేటి కథానాయికల్లో అద్భుతంగా డ్యాన్స్ వేయగలదనే కారణంతోనే ఈ అవకాశం తమన్నాకి వరించింది..

తమన్నాతో పాటు ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా పాల్గొనాలి. కానీ అతనికి చేతికి గాయం కావడంతో ప్రదర్శన చేయలేదు.ఈ ప్రదర్శన కోసం షయామక్ ధావర్ నేతృత్వంలో తమన్నా డ్యాన్స్ శిక్షణ తీసుకుంది. ఇదే కార్యక్రమంలో  జాక్వెలిన్, హృతిక్ రోషన్,ప్రభుదేవా డ్యాన్స్ ఫెర్మార్మెన్స్ లతో అదరగొట్టారు. వీరికి కోట్లలో రెమ్యునరేషన్ అందిస్తున్నట్టు సమాచారం.

Comments

comments