వారి డ‌బ్బుల‌తో….వారి గ్రామానికి వారే రోడ్డు వేసుకున్నారు.!

త‌మ‌ ఊరికి రోడ్డు కావాలని మూడు సంవ‌త్స‌రాలుగా గ‌వ‌ర్న‌మెంట్ అధికారులకు ప‌లుమార్లు నివేదించిన గ్రామ‌స్తుల‌కు స‌హ‌నం న‌శించింది. ఇక లాభం లేదు., త‌మ గ్రామానికి తామంతా క‌లిసి రోడ్డు వేసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు ఆ గ్రామ‌స్తులు .అనుకున్న‌దే త‌డ‌వుగా స‌మావేశ‌మ‌య్యారు….. రోడ్డు కోసం ఎవ‌రికి తోచినంత వారు ఆర్థికంగా స‌పోర్ట్ చేయ‌డ‌మే కాకుండా…ప్ర‌తి ఇంటి నుండి ఒక‌రు రోడ్డు నిర్మాణంలో కూలీగా ఉండాలని నిర్ణ‌యించారు.

మూడు సంవ‌త్స‌రాల్లో కాని ప‌ని మూడు రోజుల్లో ముంద‌డుగు వేసింది.! గ్రామ‌స్తుల ఈ నిర్ణ‌యాన్ని గౌర‌వించిన స్థానిక ప‌త్రిక‌ల వాళ్ళు…ఈ వార్త‌ను త‌మ త‌మ పత్రిక‌ల్లో ప్ర‌చురించ‌డంతో…అధికారగ‌ణం క‌దిలింది…. ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం ఫండ్ ను రిలీజ్ చేసింది.

ఇదంతా అస్సాం రాష్ట్రంలోని హాప్లాంగ్ కు 11 కిలోమీట‌ర్ల దూరం ఉన్న నోటున్ లీకుల్ అనే గ్రామానికి సంబంధించిన రియ‌ల్ స్టోరి.! ఈ గ్రామానికి చాలా మంది వీదేశీ టూరిష్ట్ లు త‌ర‌చుగా విజిట్ చేస్తుంటారు… ప‌ర్యాట‌కుల కార‌ణంగా అక్క‌డ బిజినెస్ చాలా బాగా ర‌న్ అవుతుంది…కానీ రోడ్డు లేని కార‌ణంగా ఏటా ప‌ర్యాట‌కుల సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తుంది. ఈక్ర‌మంలో గ్రామ‌స్తులు ఈ నిర్ణ‌యానికి పూనుకొని ప్ర‌భుత్వంలో చ‌ల‌నం తీసుకొచ్చి స‌క్సెస్ అయ్యారు.

Comments

comments

Share this post

scroll to top