5 ఏళ్ల తర్వాత…”నిర్భయ” తల్లి తండ్రులకు ఓ యువతి రాసిన ఈ లేఖ చూస్తే కన్నీళ్లు ఆగవు..!

అప్పుడు నాకు 7 సంవ‌త్స‌రాలు. నాన్న కొత్త‌గా సైకిల్ తెచ్చారు. సైకిల్ నేర్పించ‌డం మొద‌లు పెట్టారు. వెనుక సైకిల్ ప‌ట్టుకోవ‌డంతో నేను దాన్ని తొక్కుతున్నా. ఇంత‌లో బ్యాలెన్స్ తప్పి కింద ప‌డిపోయా. మోచేతులు, మోకాళ్ల‌కు దెబ్బ‌లు తాకాయి. అది చూసి నాన్న దిగులు చెందారు. అవి చిన్న దెబ్బ‌లే కావ‌చ్చు, కానీ పిల్ల‌ల‌కు చిన్న దెబ్బ త‌గిలినా త‌ల్లిదండ్రులు త‌ట్టుకోలేరు క‌దా. మ‌రి అలాంటిది దేశ రాజ‌ధానిలో నిర్భ‌య అనే యువ‌తిపై జ‌రిగిన దారుణ‌కాండ‌కు ఆమె తండ్రి ఎంతగా త‌ల్లిడిల్లి ఉంటాడో క‌దా. ఆమె త‌ల్లిదండ్రులు 5 ఏళ్ల నుంచి అనుభ‌విస్తున్న న‌ర‌కం మాటల్లో చెప్ప‌లేనిది.

సూర్యుడు మార‌లేదు, చంద్రుడు మార‌లేదు.. మారింది ఏదైనా ఉందంటే.. అది కాల‌మే.. కాల‌మే ఆ దారుణ కాండ‌కు స‌మాధానం చెప్పాలి. రాక్ష‌సులు పోలేదు. కొత్త అవ‌తారం ఎత్తారు. నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. నేనో యువ‌తిగా నిర్భ‌య త‌ల్లిదండ్రుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నా. 2012, డిసెంబ‌ర్ 16 ఘ‌ట‌న‌ను నిర్భ‌య త‌ల్లిదండ్రులే కాదు, ఎవరూ మ‌రిచిపోలేరు. యావ‌త్ దేశం మొత్తం ఆ దారుణ ఘ‌ట‌న‌ను గుర్తు పెట్టుకుంది. నిర్భ‌య నేడు మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఆమె ఆత్మ మ‌న‌తోనే ఉంది.

నిర్భ‌య చ‌నిపోయి స‌మాజంలో కొంత మార్పు తెచ్చింది. బేటీ బ‌చావో, బేటీ ప‌ఢావో అంటున్నారు, బేటీ బ‌తికి ఉంటేనే క‌దా, చ‌దివేది. ఈ స‌త్యం జ‌నాల‌కు ఎప్పుడు తెలుస్తుందో. ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు వెళ్లే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదంటే మ‌నం ఏ స్థితిలో ఉన్నాం ? ఈ పెద్ద ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మే లేదు. మ‌రి కాల‌మే ఇందుకు స‌మాధానం చెబుతుందా..? వేచి చూద్దాం..!

Comments

comments

Share this post

scroll to top