పేరుకి టీచర్…పక్షవాతం వచ్చిన తల్లిని ఎలా కొడుతున్నాడో చూడండి.! మనవడు తెలివిగా ఏం చేసాడంటే.?

నవమాసాలు మోసి, తన ప్రాణం పోతున్నంత బాదని పంటిబిగువున పట్టి మనకు జన్మనిస్తుంది అమ్మ.అందుకే సృష్టిలో దేవుడి కంటే ఎక్కువగా అమ్మని గౌరవిస్తారు,పూజిస్తారు.పురిటి నొప్పుల బాద తెలిసినవారేవరైనా కన్నతల్లిని కష్టపెట్టడానికి వెనకాడతారు..అలాంటిది కన్నతల్లిని చిత్రహింసలు పెట్టి,ఆవిడ మరణానికి కారకులయిన పిల్లలు ఉన్నారంటే ఎటు పోతుంది మన సమాజం అనిపించకమానదు..అలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరలవుతుంది…

రాజస్థాన్ లోని అల్వార్ అనే ప్రాంతంలో 10 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంభందించిన వీడియో .. చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడికి గురి చేస్తోంది.  కన్నతల్లిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ చిత్ర హింసలు పెట్టిన వ్యక్తి జోగేంద్ర చౌదరి. ఆ ఊర్లోనే ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నాడు.చదవుకున్న మూర్ఖుడు. భర్త చనిపోవడంతో అనారోగ్యం బారిన పడటం, కొన్ని రోజుల క్రితమే పక్షవాతం రావటంతో తన పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో కొడుకు సహాయం కోరుతూ అతడి వద్దకు చేరింది. ఇంట్లో భార్యతో తరచూ ఏదో గొడవ పడుతూ ఆమెపై ఉన్న కోపాన్ని తల్లిపై చూపించేవాడు. ప్రత్యక్ష నరకం చూసిన ఈ నిస్సహాయకురాలు ప్రాణాలు విడిచింది.

తన తండ్రి చేతిలో  నానమ్మ గత కొన్ని రోజులుగా పడుతున్న హింసను చూసి భరించలేక,స్వయంగా జోగేంద్ర కన్నకొడుకే , తన తండ్రి నానమ్మను కొడుతుండగా వీడియోను తీశాడు. ఈ వీడియో అందరికీ చేరేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో స్థానిక పోలీసుల వద్దకు చేరటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొమ్మిది నెలలు మోసి కన్నది అనే కృతజ్ణత లేదు,పెంచి పెద్దచేసి ప్రయోజకున్ని చేసిందనే కనికరం కించిత్ కూడా లేదు,కనీసం నాన్నమ్మ పట్ల మనుమడికి కలిగిన బాద కన్నకొడుకుకి కలగకపోవడం విషాదకరం..

Watch Video:

Comments

comments

Share this post

scroll to top