సొంత కొడుకు-కోడలే ఆ 85 ఏళ్ల వృద్ధురాలిని చలిలో బయటకి పంపించి లాక్ వేశారు..! అంతేకాక తర్వాత..!

నేటి ఆధునిక యుగంలో మ‌నుషుల్లో మాన‌వ‌త్వం అనేది క‌నుమ‌రుగైపోతోంది. రోడ్డు మీద ఎవ‌రైనా ఆప‌ద‌లో ఉంటే ర‌క్షించే రోజులు పోయాయి. ఆ.. నాకెందుకులే అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచిస్తున్నారు. ఇక కొంద‌రు ప్ర‌బుద్ధులు అయితే క‌న్న త‌ల్లిదండ్రుల‌నే క‌ష్టాల పాలు చేస్తున్నారు. క‌ని, పెంచి, విద్యాబుద్ధులు చెప్పింది, ప్ర‌యోజ‌కుల‌ను చేస్తే క‌నీసం ఆ క‌రుణ కూడా లేకుండా ప‌శువుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. యూపీలో స‌రిగ్గా ఇలాంటిదే ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌న్న త‌ల్లినే గొలుసుల‌తో క‌ట్టేసి తిండి పెట్ట‌కుండా క‌ష్టాల పాలు చేస్తున్నాడు ఆ కొడుకు. చివ‌ర‌కు పోలీసుల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో వారు క‌ల‌గ‌జేసుకుని ఆ వృద్ధురాలిన ఆ చెర నుంచి విడిపించారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఉన్న లోహియా న‌గ‌ర్ కాన్షీరాం కాల‌నీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబంలో 85 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న అక్బ‌రి బేగం అనే వృద్ధురాలు ఉంటోంది. అయితే ఆమెను క‌న్న కొడుకే గొలుసుల‌తో బంధించాడు. అది కూడా ఆరుబ‌య‌ట ఒక ఆటోలో. దీనికి తోడు ఆమెకు ఆహారం కూడా స‌రిగ్గా పెట్టేవారు కాదు. అయితే ఇదే విష‌యాన్ని పోలీసుల‌కు కొంద‌రు చెప్ప‌గా వారు ఆ ఇంటికి చేరుకుని విష‌యం ఆరా తీశారు.

అయితే అక్బ‌రి బేగం కోడ‌లు ఆబిదా మాట్లాడుతూ త‌న అత్త‌కు మతి స్థిమితం ఉండ‌డం లేద‌ని చెప్పింది. అందుకే బ‌యట ఆటోలో గొలుసుల‌తో క‌ట్టేశామ‌ని, రాత్రిపూట ఇంట్లో ఉంచుకుంటామ‌ని చెప్పింది. ఆమెను గొలుసుల‌తో క‌ట్టేయ‌కుండా ఉంచితే కాల‌నీల్లో తిరుగుతూ స్పృహ త‌ప్పి ప‌డిపోతుంద‌ని అందుకే అలా చెయిన్ల‌తో లాక్ చేశామ‌ని చెప్పింది. అయితే ఇరుగు పొరుగు చెప్పిన వివ‌రాలు వేరేగా ఉన్నాయి. స‌ద‌రు అక్బ‌రి బేగం భ‌ర్త గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగి అట‌. అత‌ను చ‌నిపోయిన‌ప్పుడు వ‌చ్చిన డ‌బ్బును మొత్తం కొడుకు కాజేశాడ‌ట‌. ఇదేమిట‌ని అడిగే ఆమెను అలా లాక్ చేశార‌ట‌. ఇదీ.. విష‌యం… అయితే స‌రే.. ఏది ఏమైనా వారు చెప్పింది ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా ఎంత మ‌తిస్థిమితం లేక‌పోయినా అలా ఓ పండు ముదుస‌లిని గొలుసుల‌తో మాత్రం క‌ట్టేయ‌కూడ‌దు క‌దా. అలా అని పోలీసులు కూడా వారికి చెప్పారు. దీంతో వారు ఆ వృద్ధురాలిని గొలుసుల నుంచి విముక్తి చేశారు. ఏది ఏమైనా ఇలాంటి గ‌తి ఏ తల్లికి ప‌ట్ట‌కూడ‌దు..!

Comments

comments

Share this post

scroll to top