జియోకు పోటీగా AIRTEL ఎంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందిస్తుందో తెలుసా.? ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాక్!

ప్ర‌స్తుతం న‌డుస్తున్నదంతా పోటీ యుగం. వ్య‌క్తుల మ‌ధ్యే కాదు సంస్థ‌ల మ‌ధ్య కూడా పోటీయే. ఇక ఈ మ‌ధ్య కాలంలో మ‌న దేశంలో టెలికాం కంపెనీలు అయితే పోటీ ప‌డి మ‌రీ వినియోగ‌దారుల‌కు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. వాటిల్లో 4జీ ఫోన్లు కూడా ఉన్నాయి. జియో 4జీ ఫోన్ ఎప్ప‌టి నుంచైతే మార్కెట్‌లోకి వ‌చ్చిందో, అప్ప‌టి నుంచి టెలికాం కంపెనీలు కూడా 4జీ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌డం ప్రారంభించాయి. తొలుత ఎయిర్‌టెల్ సంస్థ కార్బ‌న్ ఎ40 ఇండియ‌న్ పేరిట రూ.1399కే ఫోన్‌ను అందుబాటులోకి తేగా, త‌రువాత బీఎస్ఎన్ఎల్ మైక్రోమ్యాక్స్ భార‌త్ వ‌న్ ఫోన్‌ను తెచ్చింది. అనంత‌రం వొడాఫోన్ మైక్రోమ్యాక్స్ భార‌త్ 2 అల్ట్రాను విడుద‌ల చేసింది. అయితే ఇది ఇక్క‌డితో ఆగ‌డం లేదు. ఎయిర్‌టెల్ తాజాగా త‌న రెండో బ‌డ్జెట్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్‌ను విడుద‌ల చేసింది. సెల్‌కాన్ స్మార్ట్ 4జీ పేరిట ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.1349 మాత్రమే.

అయితే ఎయిర్‌టెల్ విడుద‌ల చేసిన సెల్‌కాన్ స్మార్ట్ 4జీ ఫోన్‌ను వినియోగదారులు ముందుగా రూ.2,849 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుది. అనంతరం వారు నెలకు రూ.169 చొప్పున 36 నెలల పాటు రీచార్జి చేస్తూ ఫోన్‌ను వాడాలి. అలా వాడితే 18 నెలలకు రూ.500, 36 నెలలకు రూ.1000 వెనక్కి ఇస్తారు. దీంతో 3 ఏళ్లకు మొత్తం రూ.1500 వెనక్కి వస్తుంది. ఈ క్రమంలో ఫోన్ ధర కేవలం రూ.1349 మాత్రమే అవుతుంది. ఇక వినియోగదారులకు రూ.169 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. దీంతోపాటు రోజుకు 500 ఎంబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు. కార్బన్ ఎ40 ఇండియన్ ఫోన్ తరువాత ఎయిర్‌టెల్ విడుదల చేసిన రెండవ బడ్జెట్ 4జీ ఫోన్ ఇదే కావడం విశేషం.

సెల్‌కాన్ స్మార్ట్ 4జీ ఫోన్‌లో ఫీచర్ల విష‌యానికి వ‌స్తే ఇందులో 4 ఇంచ్ డిస్‌ప్లే ను ఏర్పాటు చేశారు. ఇది 800 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను క‌లిగి ఉంది. అలాగే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 8 జీబీ అంత‌ర్గ‌త స్టోరేజ్ ఉండ‌గా, ఫోన్ మెమొరీని 32 జీబీ వ‌రకు పెంచుకోవ‌చ్చు. ఇక ఇందులో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో డ్యుయల్ సిమ్ ను వేసుకోవ‌చ్చు. 4జీ వీవోఎల్‌టీఈ స‌దుపాయం ఉంది. వెనుక భాగంలో 3.2 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 1500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు.

Comments

comments

Share this post

scroll to top