దూసుకొస్తున్న ట్రైన్ ముందు సెల్ఫీలు దిగాలని ట్రై చేస్తే జైలు పాలే.!?

ఎక్కడపడితే అక్కడ సెల్పీలు దిగే…సెల్ఫీ ప్రేమికులకు ఓ హెచ్చరిక.! సరదాగా దిగే సెల్ఫీనే మిమ్మల్ని జైలు పాలు చేసే ప్రమాదముంది. అనువుగానీ చోట క్లిక్ మనిపించిన సెల్ఫీనే  మిమ్మల్ని  అయిదేళ్ల పాటు ఊచలు లెక్కించే స్థితికి తీసుకువస్తుంది. అవును….రైల్వే పోలీసులు కొత్తగా తీసుకురాబోతున్న చట్టం ప్రకారం….రైలు వస్తున్నప్పుడు కానీ, రైల్లో డోర్ దగ్గర నిలబడి కానీ సెల్ఫీలు దిగుతున్నట్టు కనిపిస్తే ఏడాది నుండి అయిదేళ్ల వరకు జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని  రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు.

13957580_1071992319505219_698052318_n

 

ఇటీవల కాలంలో…చాలా మంది ఇలా ట్రైన్ ముందు సెల్ఫీలు దిగుతూ ప్రాణాలుకోల్పోయిన నేపథ్యంలో ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేశారు రైల్వే పోలీసులు. అంతేకాదు ట్రైన్లో టైమ్ పాస్ కోసం పేకాట ఆడడం కూడా నేరం కింద పరిగణించనున్నారు. పేకాట ఆడడం, ప్రమాదకరరీతిలో సెల్ఫీలు దిగడాన్ని,  ఇతరులు ఇబ్బంది కల్గించడం, న్యూసెన్స్ కేస్ కింద బుక్ చేసి .. 5 యేళ్ళ వరకు జైలు శిక్ష వేసే అవకాశం ఉంది.

ఇటీవల ముగ్గురు కాలేజ్ విద్యార్థులు ప్రమాదకర రీతిలో వేగంగా వస్తున్న రైల్ కు ఎదరుగా వెళ్తూ సెల్ఫీలు దిగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే. సెల్ఫీ లలో ఆనందం ఉండాలి కానీ అది మరణాన్ని కోరేదై ఉండొద్దు.

Comments

comments

Share this post

scroll to top