విడుదలకి ముందే లాభాల బాటలో మహర్షి ప్రొడ్యూసర్స్, మహేష్ మేనియా అలాంటిది..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం అయిన మహర్షి సినిమా మే 9 న విడుదలవుతుంది, ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే 100 కోట్లు దాటింది, దాదాపు 105 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా కి, కొన్ని ఏరియా లలో ఇంకా ఎక్కువ కి కొనే అవకాశాలు ఉండటం తో లెక్క పెరిగే అవకాశం ఉంది.

50 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ రైట్స్.. :

ఇక సాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కలిపి 50 కోట్ల వరకు అమ్ముడుపోయినట్టు సమాచారం, తెలుగు హిందీ బాషలలో సాటిలైట్ రైట్స్ లో బాహుబలి తరువాత అత్యధికంగా అమ్ముడుపోయిన చిత్రం గా మహర్షి సినిమా కొత్త రికార్డు నెలకొల్పింది, ఇక డిజిటల్ రైట్స్ లో టాలీవుడ్ లోనే ఎక్కువ ధరకి అమెజాన్ ప్రైమ్ వీడియో మహర్షి చిత్రాన్ని సొంతం చేసుకోడం మరొక రికార్డు.. మొత్తం సినిమా బడ్జెట్ 90 కోట్లు, విడుదలకి ముందే దాదాపు 50 కోట్లకు పైగానే లాభాన్ని ప్రొడ్యూసర్స్ అందుకున్నట్టు సమాచారం. ఇటీవలి కాలం లో ఇంత బిజినెస్ చేసి ప్రొడ్యూసర్స్ కి ఈ రేంజ్ లో విడుదలకి ముందే లాభాలని తెచ్చి పెట్టిన బడా సినిమా మహర్షి మాత్రమే.

సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ సునామి.. :

మే 9 న ప్రపంచవ్యాప్తంగా మహర్షి సినిమా విడుదల కానుంది. మహేష్ బాబు అభిమానులు మహర్షి సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ ల్యాండ్ మార్క్ మూవీ కావడం తో మూవీ పైన అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి, అదే విధంగా మూవీ ని కిందకు లాగాలని చాలా మంది రకరకాలుగా పుకార్లు సృష్టిస్తున్నారు విడుదలకి ముందే, కాని సూపర్ స్టార్ మహేష్ సత్తా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆ పుకార్లని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మార్చి 29 న మహర్షి చిత్రం లోని మొదటి పాటను విడుదల చెయ్యనున్నారు.

ముగ్గురు నిర్మాతలు.. :

మహర్షి చిత్రం లో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది, అల్లరి నరేష్ మహర్షి చిత్రం లో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మహర్షి చిత్రానికి దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. వేసవి లో తెలుగు నుండి విడుదలవుతున్న ఏకైక పెద్ద సినిమా మహర్షి నే. మే 9 నుండి మరిన్ని రికార్డ్స్ తిరగరాస్తాడో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top