తాగుబోతు తండ్రిపై పదేళ్ల కొడుకు తిరుగుబాటు.! “పెళ్లెందుకు చేసుకున్నావ్..? నన్నెందుకు కన్నావ్?”

మొన్నటికి మొన్న తండ్రిచేత మధ్యం మాన్పించడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టింది ఒక చిన్నారి.తండ్రి తాగుడు మానకపోతే చనిపోతానని బెదిరించడానికి ఎలుకల మందు తిన్న భవాని ,మూడు రోజులు మృత్యవుతో పోరాడి ప్రాణాలొదిలిన ఘటన,ఆ చిన్నారి ఇంకా మన కళ్లముందే తిరుగుతున్నారు.ఇప్పుడు తాగొచ్చి తండ్రి పెట్టే బాదలు భరించలేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.పదేళ్ల పసివాడు తన తండ్రి చూపిస్తున్న నరకాన్ని పోలీస్ స్టేషన్లో ఏకరువు పెట్టడమే కాదు..తండ్రికి కొన్ని ప్రశ్నలు సంధించాడు…

కరీంనగర్ జమ్మికుంట మోత్కులగూడెంలో ఉండే శ్రీనివాస్ కొడుకే  శశికుమార్. మద్యానికి బానిసైన శ్రీనివాస్ రోజూ తాగొచ్చి భార్య, కొడుకు శశికుమార్, కూతురును కొడుతుండేవాడు. భార్య కూలీనాలీ చేసి తెచ్చిన పైసలతో కుటుంబాన్ని పోషించేది..తన కష్టంతో పిల్లల్ని చదివించి,కుటుంబ పోషణ చూసుకోవాల్సింది పోయి.. ఏనాడు కుటుంబాన్ని పట్టించుకోకుండా…. తాగుడు పైసల కోసం భార్య, పిల్లలను హింసించేవాడు శ్రీనివాస్. గవర్నమెంట్  స్కూల్లో చదువుతున్న శశికుమార్ తండ్రి పెట్టే బాదలను భరించలేక  పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేశాడు. జమ్మికుంట సీఐకి తండ్రి శ్రీనివాస్ పెట్టే చిత్రహింసలను వివరించాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు కమిలిన శరీరాన్ని చూపించాడు శశికుమార్. బాబు ఒంటిపై దెబ్బలను చూసిన పోలీసులు శ్రీనివాస్ ను స్టేషన్ కు పిలిపించారు. బాబును ఓదార్చి తన తండ్రిని ఏమడగాలనుకుంటున్నావో అడగమన్నాడు. .పెళ్లెందుకు చేసుకున్నావ్..మమ్మల్ని ఎందుకు కన్నావ్.. అంటూ తండ్రి పెడుతున్న బాధలకు పదేళ్ల పసిహృదయం సంధించిన ప్రశ్నలకు అక్కడున్న వారి హృదయాలు కరిగిపోయాయి.

Comments

comments

Share this post

scroll to top