తాగి దొరికిపోయిన కమెడియన్ నవీన్,కారు కింద దాక్కున్నాడు.మీడియా రాగానే పారిపోయాడు

వీకెండ్స్ లో మందుకొట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరక్కుండా ఇంటికి చేరుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మందు కొట్టి వాహనాలు నడపవద్దని పోలీసులు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా  వీకెండ్స్ లో  డ్రంక్ అండ్ డ్రైవ్ ని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు..ఎంత ప్రచారం చేసినా,  ఎన్ని కేసులు బుక్ చేస్తున్నా వీరు ఎంతమాత్రమూ మారడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, మందు కొట్టి వాహనం నడుపుతున్నవారు అడ్డంగా దొరికిపోయారు. వాళ్లల్లో కమెడియన్ నవీన్ కూడా ఉన్నాడు.

‘100% లవ్’,ఆటోనగర్ సూర్య, రోటిన్ లవ్‌స్టోరీ, తుంగభద్ర, కుమారి 21ఎఫ్,  మళ్లీమళ్లీ రానిరోజు మొదలైన సినిమాల్లో నటించిన నవీన్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కొన్ని షోస్ చేసాడు.అయితే సినిమాల్లో ఏ విధంగా కామెడి చేస్తాడో…డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా నవీన్ అదే విధంగా ప్రవర్తించాడు.పోలీసులకు చిక్కిన  నవీన్‌ తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన తనిఖీలో… కారు డ్రైవ్‌ చేస్తూ వస్తున్న నవీన్‌ను ఆపి తనిఖీ చేయగా.. మద్యం తాగినట్లు తేలింది. దీంతో అక్కడే ఉన్న మీడియా వాళ్లు వీడియో తీయబోతుంటే… మీడియా కంట పడకూడదనే ఉద్దేశంతో నవీన్‌ కారు దిగి పరుగులు తీశాడు. ఆ వెనుకే ఉన్న మరో కారు కింద దాక్కున్నాడు… అతడు పారిపోతున్నాడని భావించిన పోలీసులు వెంబడించి పట్టుకోవడంతోపాటు వాహనం సీజ్‌ చేశారు. .నవీన్ ఇప్పటివరకూ చాలా సినిమాల్లో కామెడి పండించారు..నిజజీవితంలో పండించిన ఈ కామెడీకీ టివిల్లో చూసిన జనాలు తెగ నవ్వుకుంటున్నారు..

watch video here:

Comments

comments

Share this post

scroll to top