తినడానికేమీ దొరక్క, మట్టిని బుక్కుతున్న మనుషులు. యుద్దం మిగిల్చిన విషాదం.

యుధ్దం మిగిల్చిన విషాదమిది. ఆ యుద్దంలో చచ్చినా బాగుండు, ఇలా ప్రతిక్షణం చస్తూ బ్రతకడం కంటే అనుకుంటున్న వైనమిది. తినడానికేమీ దొరక్క మన్ను బుక్కుతున్న సిరియా పౌరుల  ధైన్యమిది. ఆకలి బాధతో కడుపులో పేగులు మెలిపెడుతుంటే… కంటికి కనిపించిన గడ్డిని, పిల్లులను ,కుక్కలను కూడా తిన్నారు…ఇప్పుడవీ కూడా దొరకక మట్టిని తింటున్నారు. ఏం చేస్తారు పాపం వారు మాత్రం.!  బ్రతకాలంటే తినాలి కదా.!

syria-video-children-explain-why-890x395

ప్రతి ఒక్కరినీ కదిలించే ఈ హృదయవిధారక  సంఘటన సిరియా దేశంలో మండాయ్ పట్టణంలోనిది.ఈ చిత్రాలు  వారి ఆకలి బాధను కళ్ళకు కట్టినట్లు  చూపిస్తాయ్. ఆకలి బాధకు తట్టుకోలేక  ఆకులు, గడ్డి, కుక్కలు, పిల్లులు కనిపించిన ఏదో ఒక జంతువును ఆహారంగా తీసుకునేవారు. చివరికి అవి కూడా అక్కడ లభించడం లేదు. పొట్టనింపుకునేందుకు మట్టిని ఆహారంగా తీసుకుంటున్నారు. చాలామంది తిండిలేక ఏ పనీ చేయడానికి ఓపిక లేక మంచాలకు అతుక్కుపోయారు. .ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ సిరియాలోని ఈ పట్టణాన్ని సిరియాకు చెందిన బసల్ అల్ అసద్ సైన్యం అదుపులోకి తీసుకుంది. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధ కారణాల వల్ల గడిచిన 5 సంవత్సరాలలో 2,50,000 మంది మరణించారు.

యుద్దం వల్ల ఒరిగిందేంటీ…?

ఓ సారి ఈ వీడియో చూడండి… యుద్దాన్ని ఖండిస్తూ సిరివెన్నెల కంచె సినిమాలో తన కుంచెతో చెప్పిన సమాధానం.

Comments

comments

Share this post

scroll to top