ఎర్ర టీషర్ట్ పిల్లాడి శవం ఫొటో మర్చిపోకముందే మరొక ఫొటో…. హ్యాట్సాఫ్ ఫొటోగ్రాఫర్..

ఎర్ర టీషర్ట్ ,నీలంరంగు చెడ్డీ ధరించిన పిల్లాడు సముద్రం ఒడ్డున పడుకున్నట్టున్నన్న సిరియా బాలుడి శవం ఫొటో ప్రపంచం మొత్తాన్ని కదిలిచింది..ఆ తర్వాత వచ్చిన ఎన్నో ఫోటోలు మనసుల్ని కలిచివేసాయి..కసాయి వాళ్ల చేత కూడా కంటతడి పెట్టించాయి..అంతర్యుద్ధంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న సిరియా నుంచి కొన్నేళ్లుగా గుండెల్ని పిండేసే ఎన్నో ఫొటోలు ప్ర‌పంచం ముందుకు వ‌చ్చాయి.కేవలం ఫోటోల్ని చూసిన మన పరిస్థితే ఇలా ఉంటే ఆ ఫోటోల్ని తీసే వారి వేదన ఇంకెలా ఉండుంటుంది…

విగ‌త జీవులైన చిన్నారులు.. త‌మవాళ్ల‌ను కోల్పోయి గుండెల‌విసేలా రోదిస్తున్న వారి ఫొటోలు క‌లిచివేశాయి. వృత్తిధ‌ర్మంలో భాగంగా ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న‌ల‌ను ఫొటోలు తీస్తున్నారు ఫొటోగ్రాఫర్లు. కానీ వీట‌న్నిటినీ చూసి విసిగిపోయాడు ఓ ఫొటోగ్రాఫ‌ర్‌. త‌న వృత్తిధ‌ర్మాన్ని కాసేపు ప‌క్క‌న‌పెట్టాడు. ఆత్మాహుతి దాడిలో గాయ‌ప‌డిన ఓ చిన్నారిని కాపాడ‌టానికి ఆ ఫొటోగ్రాఫ‌ర్ అత‌న్ని త‌న చేతుల‌పై మోసుకెళ్తున్న ఫొటోలు ఇప్పుడు ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఆ చిన్నారిని కాపాడ‌గ‌లిగినా.. మ‌రో చిన్నారి త‌న క‌ళ్ల ముందే చ‌నిపోవ‌డం చూసి అత‌ను గుండెల‌విసేలా రోధిస్తున్న మ‌రో ఫొటో.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది

అలెప్పోలో బ‌స్సుల‌పై జ‌రిగిన బాంబు దాడి దాడిలో 80 మంది చిన్నారులు  ప్రాణాల‌ను కోల్పోయారు. అదే టైం లో అక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్న ఫొటోగ్రాఫ‌ర్ అబ్ద్ అల్క‌ద‌ర్ హ‌బ‌క్‌.. దాడిలో స్పృహ కోల్పోయాడు.కాసేపటికి తేరుకున్న హబక్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులను చూసి చలించిపోయాడు..చేతిలో ఉన్న కెమెరాను పక్కన పడేసి..చిన్నారులను రక్షించాలని నిశ్చయించుకున్నాడు… ముందు ఓ చిన్నారిని చూస్తే అత‌ను అప్ప‌టికే చనిపోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరో చిన్నారిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్ వైపు ప‌రుగెత్తాడు..

ఆ చిన్నారి తనను గట్టిగా ప‌ట్టుకొని, తనవైపు దీనంగా చూడటం ఇప్ప‌టికీ క‌ళ్ల ముందు మెదులుతున్న‌ది అని హ‌బ‌క్ ఆ భ‌యాన‌క ఘ‌ట‌న గురించి చెప్తూ..తాను సాయం చేసిన ఆ బాలుడు బతికాడా లేదా అన్నది తనకు తెలియలేదని చెప్పాడు.ఆ తర్వాత మ‌రో చిన్నారిని విగ‌త‌జీవిగా చూసే స‌రికి తాను దుఃఖం ఆపుకోలేక‌పోయాన‌ని హబక్ చెప్పాడు

ఈ ఫొటోల‌ను అక్క‌డే ఉన్న మ‌రో ఫొటోగ్రాఫ‌ర్ ముహ‌మ్మ‌ద్ అల్‌గ‌రెబ్‌ తీశాడు.

Comments

comments

Share this post

scroll to top