అక్క‌డ ఉద్యోగుల‌కు లంచ్ బ్రేక్ కాస్తా శృంగారం బ్రేక్ కానుందా..?

నిత్యం వివిధ సంద‌ర్భాల్లో క‌లిగే ఒత్తిడి… మ‌రోవైపు ఆఫీస్‌లో ప‌ని భారం… ఆందోళ‌న‌… వెర‌సి స‌గ‌టు ఉద్యోగి శృంగార జీవితాన్ని స‌రిగ్గా ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నాడ‌నేది వాస్త‌వం. ఇది ప్ర‌ధానంగా మ‌న‌కు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో క‌నిపిస్తుంది. అయితే ఇది కేవ‌లం మ‌న ద‌గ్గ‌రే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ న‌గ‌రాల్లోనూ ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌ది దాదాపుగా ఇదే ప‌రిస్థితి. దీంతో వారు మొక్కుబ‌డిగా శృంగారం చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో కొంద‌రు భార్యాభ‌ర్త‌ల సంబంధాలు విడిపోయేదాకా వ‌స్తున్నాయ‌నేది కొంద‌రు మానసిక శాస్త్రవేత్త‌ల వాద‌న‌. అయితే అందులో స్వీడ‌న్ అంద‌రిక‌న్నా ముందు వ‌రుస‌లో ఉంద‌ట‌. అక్క‌డ ప‌నిగంట‌లు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ జంట‌లు శృంగారంలో చాలా త‌క్కువ‌గా పాల్గొంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డాల‌న్నా, వారు శృంగారంలో తర‌చూ పాల్గొనాల‌న్నా… అందుకు ఓ కొత్త ర‌క‌మైన ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ పెడితే బాగుంటుంద‌ని అక్క‌డి ఓ నేత భావించారు. ఇంత‌కీ అత‌ను చేసిన ప్ర‌తిపాద‌న ఏమిటంటే…

office-work
సాధార‌ణంగా ఉద్యోగాలు చేసేవారికి లంచ్ టైమ్‌లో బ్రేక్ ఉంటుంది. అయితే ఆ టైంలో ఆఫీస్‌లో ఉండ‌కుండా ఇంటికెళ్లి భోజ‌నం చేసి ఎంచ‌క్కా శృంగారంలో పాల్గొని వ‌స్తే బాగుంటుంద‌ని, దీంతో ప‌నిలో హుషారు పెరిగి ఉత్సాహంగా ప‌ని చేస్తార‌ని, దాంతోపాటు ఆ భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య శృంగార జీవితం కూడా బాగుంటుంద‌ని, వారి బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని స్వీడ‌న్‌లోని ఓ టౌన్ కౌన్సిల‌ర్ తాజాగా ప్ర‌తిపాద‌న తీసుకొచ్చారు. ఆయ‌న పేరు పెర్ ఎరిక్ ముస్కోస్‌. ఆయ‌న ఏం చెబుతున్నారంటే… అలా ఉద్యోగులు లంచ్ బ్రేక్‌లో వెళ్లి శృంగారంలో పాల్గొని వ‌స్తే రెండు ర‌కాలుగా లాభం ఉంటుంద‌ని అంటున్నారు.

ఓ వైపు ఆఫీసులో ప‌ని బాగా చేస్తార‌ని, దాంతో ప‌ని గంట‌లు పెరుగుతాయ‌ని, మ‌రో వైపు వారి వైవాహిక జీవితం కూడా బాగుంటుంద‌ని అంటున్నారు. అయితే మ‌రి ఇంటికి వెళ్లే ఉద్యోగులు అంద‌రూ శృంగారంలో పాల్గొనాల‌ని ఏముంది, కొంద‌రు వేరే ప‌ని కూడా చేసుకోవ‌చ్చు క‌దా, అని అక్క‌డి ప‌లువురు ఇత‌ర నాయ‌కులు వాదిస్తున్నారు. అయితే ఇప్ప‌టికైతే ఈ ప్ర‌తిపాద‌న బిల్లు రూపంలో ఉంది కానీ దాన్ని ఆమోదిస్తారా, లేదా అన్న‌ది వేచి చూడాలి. ఒక‌వేళ ఆమోదం పొందితే అప్పుడు జంట‌లు లంచ్ బ్రేక్‌ను కాస్తా శృంగారం బ్రేక్‌గా మారుస్తాయో ఏమో మ‌రి..! చూడాలిక‌..!

Comments

comments

Share this post

scroll to top