పెళ్ళైన వారం రోజులకే సంచలన విషయాలు బయట పెట్టిన స్వాతి నాయుడు..

తెలుగు శృంగార తార స్వాతి నాయుడు ఫిబ్రవరి నెలలో అవినాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ చానల్ కు స్వాతి నాయుడు తన భర్తతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చింది. తమ రిలేషన్ ఎలా మొదలైంది, పెళ్లి సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి లాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చింది స్వాతి నాయుడు.
అవినాష్ తల్లిదండ్రులకి నా గురించి, నేను చేస్తున్న వీడియోస్ గురించి తెలుసు. నేనే స్వయంగా వెళ్లి మా పెళ్లి గురించి వాళ్ల పేరెంట్స్ కు చెప్పా. వాళ్లు మా పెళ్లికి నో చెప్పేసారు. నా ప్రొఫెషన్, నేను చేస్తున్న వీడియోస్ వాళ్లకు నచ్చలేదు. చెప్పినా అర్ధం చేసుకునే స్ధితిలో వాళ్లు లేరు. నాకు తప్ప ఎవరికిచ్చైనా పెళ్లి చెయ్యడానికి సిద్ధమని చెప్పారు. అందుకే వారిని కాదని పెళ్లి చేసుకున్నాం. దీని గురించి మా నాన్నకు చెప్తే ఆయన వెళ్లి అవినాష్ పేరెంట్స్ తో మాట్లాడారు. మీ అమ్మాయి గురించి మీకు తెలీదా… ఎలా ఇచ్చి పెళ్లి చెయ్యమంటారు అని మా నాన్నను ప్రశ్నించారు.


అవినాష్ పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటా అని వాళ్ల పేరెంట్స్ కు చెప్పేసాడు. దీంతో వాళ్లు మరింత సీరియస్ అయ్యారు. మాకు కొడుకు లేడు, నువ్వు చచ్చిపోయావ్ అనుకుంటాం, నీ జీవితంతో మాకు సంబంధం లేదని చెప్పి ఇంట్లోంచి పొమ్మన్నారు. వాళ్లు అలా చెప్పడంతో మేము ధైర్యంగా పెళ్లి చేసుకున్నాం.
మా పెళ్లి విజయవాడలో జరిగింది. ఆ తర్వాత హనీమూన్ కూడా నాలుగు రోజులు విజయవాడలోనే జరిగింది. షూటింగ్ ఉండడంతో తిరిగ హైదరాబాద్ వచ్చేసాం. పెళ్లికి ముందు శోభనం సీక్రెట్ గా జరిగేది… ఇప్పుడు అందరూ పాల గ్లాసుతో లోపలికి పంపడంతో సిగ్గు వేసింది అని స్వాతి నాయుడు తెలిపింది.
అవినాష్ మాట్లాడుతూ…. ఇప్పుడు అందరూ నన్ను స్వాతిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడుగుతున్నారు. నాపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. వాటన్నిటికి సిద్ధపడే పెళ్లి చేసుకున్నా. స్వాతి కోసం నేను నా ఫ్యామిలీనే వదిలేసుకున్నా. అలాంటిది ఎవరో ఏదో అంటే నేను పట్టించుకోను. పెళ్లి తర్వాత స్నేహితులు కూడా దూరం పెట్టారు. మా ఇద్దరి మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు స్వాతిని వదిలేయ్ అని సూచనలిస్తున్నారు. మొదట మేమిద్దరం ఫ్రెండ్స్, తర్వాత రిలేషన్ షిప్ లోకి మారింది. సమాజం ఏమనుకున్నా నాకు పర్లేదు. వీడియోస్ చేస్తోంది అంటే అది తన కెరీర్… కెరీర్ కు అడ్డు చెప్పను అని అవినాష్ చెప్పాడు

Comments

comments

Share this post

scroll to top