శార‌దా పీఠం .. భ‌క్తికి ప్ర‌తిరూపం – స్వ‌రూపానందేంద్ర ప్ర‌స్థానం

అన్ని దారులు అటు వైపు వెళుతున్నాయి. వివిధ రంగాల‌కు చెందిన వారు..ల‌బ్ధ ప్ర‌తిష్టులైన వారి అడుగుల‌న్నీ ఆ ప‌విత్ర‌మైన ..భ‌క్తుల‌కు సాంత్వ‌న చేకూర్చుతోంది విశాఖప‌ట్ట‌ణంలోని పెందుర్తిలో శార‌దా పీఠం. ఆధ్యాత్మిక‌త‌కు..యాగాల‌కు చిరునామా ఈ పుణ్య స్థ‌లం. ఇక్క‌డ కొలువై వున్న అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు క్యూ క‌డ‌తారు. సాక్షాత్తు భ‌క్తి స్వ‌రూపుడైన పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామీజీని అనుస‌రిస్తారు. ఆయ‌న బోధ‌న‌ల‌ను ..ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన ఆధ్యాత్మిక , ధార్మిక విలువ‌ల‌ను ఆల‌కిస్తారు. అవ‌లోక‌న చేసుకుంటారు. భ‌క్తికి..సామాజిక బాధ్య‌త‌కు మ‌ధ్య‌న కుటుంబ‌మ‌నే బంధాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఎంద‌రో ఆధ్యాత్మిక వేత్త‌లు, స్వాములు నిరంత‌రం ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. అలుపంటూ ఎరుగ‌క క‌ష్ట‌ప‌డుతున్నారు. కుల మ‌తాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు ధ‌ర్మ‌బ‌ద్ధంగా వుండాల‌ని, ప‌దుగురికి చేయూత‌నివ్వాల‌ని..ఆప‌ద స‌మ‌యంలో వున్న‌ప్పుడు ఆదుకోవాల‌ని..క‌ష్టాల సుడిగుండంలో చిక్కుకున్న వారికి ఆస‌రాగా నిల‌వాల‌ని పీఠాలు, ఆశ్ర‌మాలు, అధిప‌తులు, పీఠాధిప‌తులు పిలుపునిస్తున్నారు. విలువైన జీవితాన్ని గుర్తెరిగారు కాబాట్టే వారు రుషుల‌య్యారు. యోగుల‌య్యారు. ఆధ్యాత్మిక వేత్త‌లుగా..భ‌విష్య‌త్‌ను నిర్దేశించే మ‌హ‌నీయులుగా వినుతికెక్కారు.

ఎంద‌రో మ‌హానుభావులు త‌మ త‌మ ప‌ద్ధ‌తుల్లో ఆధ్యాత్మికత భావ‌జాలాన్ని , సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను , నాగ‌రిక‌త‌ను అనుస‌రించేలా..ఆచ‌రించేలా కృషి చేస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ , జ‌గ్గీ వాసుదేవ‌న్, ఢిల్లీలోని గురు మా, ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ‌ర చిన్న‌జీయ‌ర్ స్వామీజీ, మంత్రాల‌య పీఠాధిప‌తి సుబుదేంధ్ర తీర్థులు, శృంగేరి పీఠాధిప‌తి విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి, గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద‌, స్వామి సుంద‌ర చైత‌న్యానంద‌తో పాటు శార‌దా పీఠం పీఠాధిప‌తి స్వ‌రూపానంద్రేంద్ర స్వామీజీ ..బోధ‌న‌ల‌తో పాటు ఆచ‌ర‌ణ‌లో సేవా కార్య‌క్ర‌మాలను చేప‌డుతున్నారు. స్వామి వారికి సామాజిక, ఆర్థిక‌, రాజ‌కీయ‌, సాంస్కృతిక‌, సాహిత్య‌, ఆధ్యాత్మిక , త‌దిత‌ర రంగాల‌లో అపార‌మైన పాండిత్యం, జ్ఞానం, అనుభ‌వం వున్న‌ది. స‌మాజాన్ని ప్ర‌భావితం చేస్తున్న వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు, కంపెనీల అధిప‌తులతో పాటు వివిధ పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు, క్రీడాకారులు, సినీ రంగానికి చెందిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, న‌టీన‌టులు ఎంద‌రో స్వామి వారికి భ‌క్తులు. మిగ‌తా స్వామీజీలు బోధ‌న‌ల‌కే ప‌రిమిత‌మై పోతే..శార‌దాపీఠం పీఠాధిప‌తి మాత్రం ప్ర‌తి రంగం ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని అంటారు ఓ సంద‌ర్భంలో .

రాజ‌కీయ రంగంలో త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న ..అపర చాణుక్యుడు, ఉద్దండుడు, మేధావి, ప్ర‌స్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం స్వామి వారి భ‌క్తుడే. భార‌తీయ ఆధ్యాత్మిక రంగంలో ఏ యాగ‌మైనా నిర్వ‌హించే స‌త్తా స్వామి వారికి ఉన్న‌ది. ఎంతో శ్ర‌మ‌కోర్చి శార‌దా పీఠాన్ని భ‌క్తుల‌కు సౌక‌ర్యాంగా వుండేలా చేశారు. పీఠంలోకి చేరుకోగానే త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి వున్న‌ట్టే అనిపిస్తుంది. అక్క‌డ ఏర్పాటైన దేవతామూర్తుల‌ను ద‌ర్శించుకునే స‌రిక‌ల్లా మ‌న‌లో వుండే నిస్స‌త్తువ తొల‌గిపోయి చైత‌న్య‌వంతం క‌లుగుతుంది. ప్ర‌పంచానికే ఆదిశ‌క్తి స్వ‌రూపిణిగా పిల‌వ‌బ‌డుతున్న శ్రీ శార‌దా అమ్మ వారు ఇక్క‌డ కొలువై వుండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. నిత్యం అక్క‌డ పూజ‌లు, యాగాలు జ‌రుగుతూనే వుంటాయి. 1997లో పెందుర్తి మండ‌లం చిన‌ముషిడివాడ కేంద్రంగా శ్రీ శార‌దా పీఠం ఏర్పాటైంది. అదే ఏడాది ఆగ‌ష్టు నెల‌లో పీఠంలో ఆదిశంక‌రుడిని ప్ర‌తిష్టించారు. పీఠంలో శార‌దామాత‌, ఆదిశంక‌రాచార్యులు, దాసాంజ‌నేయ‌స్వామి, సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, మేధాద‌క్షిణ‌మూర్తి, గ‌ణ‌ప‌తి, శ్రీ‌కృష్ణ , ద‌త్తాత్రేయ‌, కాల‌బైరవ‌, నాగ‌దేవతామూర్తులు కొలువుతీరారు. దీనికంత‌టికి స్వామి వారే కార‌కులు.

నిత్యం భ‌క్తుల‌కు, పేద‌ల‌కు, అన్నార్థుల ఆక‌లిని తీరుస్తోంది ఈ శార‌దా పీఠం. స్వ‌రూపానందేద్ర స‌ర‌స్వ‌తి స్వామీజీ సార‌థ్యంలో వేద‌, స్మార్త విద్యార్థుల‌కు విద్యా బోధ‌న ఉచితంగా జ‌రుగుతోంది. గురువుల‌కు త‌గినంత మేర ప్రోత్సాహ‌కాల‌ను అంద‌జేస్తున్నారు. గిరిజ‌న ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతుల‌కు సౌక‌ర్యాంగా ఉండేందుకు గాను ప‌శువుల‌ను, ఆవుల‌ను ఉచితంగా విత‌ర‌ణ చేస్తున్నారు. 2012లో పీఠం ఆధ్వ‌ర్యంలో 500 మందికి పైగా గిరిజ‌న బిడ్డ‌ల‌ను తిరుప‌తికి పంపించి ద‌ర్శ‌నం చేయించిన ఘ‌న‌త స్వామి వారిదే. స్వామి వారి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను భ‌క్తులు నిర్వ‌హిస్తారు. ఆ రోజు ప్ర‌తి ఒక్క‌రికి అన్న‌దానంతో పాటు వ‌స్త్ర దానం చేస్తారు. యాగాల నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా పాల్గొనే వారికి పండితులు, పూజారుల‌ను ఘ‌నంగా స‌న్మానించ‌డం స్వామికే చెల్లింది. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణే థ‌న ధ్యేయంగా స్వామి వారు ఎన్నో కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. 1994లో రుషికేష్, కేదార్‌నాథ్, బ‌ద‌రీనాథ్‌ల‌లో పాద‌యాత్ర చేశారు. 1995లో గంగోత్రి, య‌మునోత్రి వ‌ర‌కు 1600 కిలోమీట‌ర్ల మేర‌ ర్యాలీ నిర్వ‌హించారు. 1996లో క‌ర్ణాట‌క‌లోని అద్వైతానందేంద్ర స‌ర‌స్వ‌తి ద‌గ్గ‌ర స‌న్యాసం స్వీక‌రించి ప‌ట్టా పొందారు. స్వామీజికి ప‌ర‌మ గురువు శ్రీ స‌చ్చిదానంద స‌ర‌స్వ‌తి స్వామి వారు. శార‌దాపీఠాధిప‌తికి శార‌దాపీఠంతో పాటు తిరుప‌తి, శ్రీ‌శైలం, రుషికేష్, వార‌ణాసి, త‌దిత‌ర ప్రాంతాల్లో పీఠాలు ఉన్నాయి. హైద‌రాబాద్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్‌లోని దేవాల‌యంతో పాటు ప‌లు దేవాల‌యాలు శార‌దాపీఠం ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రాంతాలుగా విల‌సిల్లుతున్నాయి.

2001లో హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం పిఠాపురం నుంచి అమ‌రావ‌తి వ‌ర‌కు 625 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేప‌ట్టారు. 2004లో అప్ప‌టి సీఎం వైఎస్ఆర్ కోరిక మేర‌కు శార‌దాపీఠంలో వ‌రుణ యాగం నిర్వ‌హించారు. 2018 తెలంగాణలో ఎన్నిక‌ల‌కు ముందు స్వ‌రూపాందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామీజీ వారి ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన రాజ‌సూయాగం అద్భుత ఫ‌లితాన్ని ఇచ్చింద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. దేవాల‌యాల‌ను ప‌రిర‌క్షించాల‌ని, వాటికి చెందిన భూములు అన్యాక్రాంతం కాకూడ‌ద‌నే డిమాండ్‌తో నిరంత‌రం పోరాటం సాగిస్తున్నారు శ్రీ స్వామి వారు. 1999లో విరూపాక్ష పీఠాధిప‌తి శార‌దాపీఠాన్ని సంద‌ర్శించారు. 2002లో అప్ప‌టి దేశ ప్ర‌ధాన‌మంత్రి దివంగ‌త పాముల‌ప‌ర్తి న‌ర‌సింహారావు స్వామీజీని ద‌ర్శించుకున్నారు. 2008లో శృంగేరి పీఠాధిప‌తి శ్రీ జ‌యంద్రే స‌ర‌స్వ‌తి సంద‌ర్శించారు. 2015, 2016లో వైఎస్ ఆర్ పార్టీ అధినేత జ‌గ‌న్ యాగంలో పాల్గొన్నారు. గ‌త డిసెంబ‌ర్ నెల‌లో గులాబీ బాస్ కేసీఆర్ త‌న కుటుంబీకుల‌తో క‌లిసి స్వామి వారి దీవెన‌లు అందుకున్నారు. చింత‌కింది శ్రీ‌నివాస‌రావు స్వామి వారి జీవిత‌చ‌రిత్ర‌ను ప‌దిమందికి తెలియాల‌నే ఉద్దేశంతో స్వరూప సుధ గ్రంధాన్ని ర‌చించారు. దీనిని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. శ్రీ‌కాకుళం జిల్లా రామ‌స్థ‌లంలో జ‌న్మించిన స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి ..అంచెలంచెలుగా వ్య‌క్తి నుంచి వ్య‌వ‌స్థ‌గా..ఆధ్యాత్మిక వేత్త‌గా ఎదిగారు. ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కంగా ఉన్నారు. వీలైతే పెందుర్తిని సంద‌ర్శించండి..స్వామి వారి కృప‌కు పాత్రులు కండి.

Comments

comments

Share this post

scroll to top