క‌ల‌ల సాకారం – సింగ‌పూర్ ఆద‌ర్శం – ఆ స్వ‌ర్గ ధామం వెనుక అత‌డు.!

ప్ర‌పంచంలో ఎక్క‌డికైనా వెళ్లండి. అక్క‌డ సింగ‌పూర్ కంట్రీ పేరు ఎత్త‌కుండా ఉండ‌లేరు. ఓ చిన్న దేశం కొద్ది కాలంలోనే స్వ‌యం స‌మృద్ధిని సాధించింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అవినీతి, అక్ర‌మాలకు చోటు ఉండ‌దు. అక్క‌డి ప్ర‌జ‌లు ప‌ద్ధ‌తి ప్ర‌కారం జీవిస్తారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చెత్త వేయ‌రు. ప్ర‌తి ఒక్క‌రు దేశం ప‌ట్ల బాధ్య‌త‌గా ఉంటారు. ఇదీ ఈ దేశం ప్ర‌త్యేక‌త‌. అత్య‌ధిక ఆదాయంతో పాటు భారీగా ప‌ర్యాట‌కులు సంద‌ర్శించే ప్రాంతం ఇదే. ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు క‌ష్ట‌ప‌డ‌తారు. ఇక్క‌డి వారికి స్వాభిమానం ఎక్కువ‌. విద్య‌, వైద్యం, ఉపాధికి ఈ దేశం అధిక ప్రాధాన్య‌త ఇస్తుంది. అక్క‌డి పౌరుల‌ను త‌మ కుటుంబీకుల కంటే ఎక్కువ‌గా చూసుకుంటుంది ఆ దేశ ప్ర‌భుత్వం.

singapore king

చ‌ట్టాలు క‌ఠిన‌త‌రంగా ఉంటాయి. ఏ ఒక్క చిన్న త‌ప్పు చేసినా త‌క్ష‌ణ‌మే శిక్ష ప‌డుతుంది. బ‌తికేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.కానీ దానిని దుర్వినియోగం చేస్తే ఊరుకోదు. ప్ర‌తి ఒక్క‌రి అవ‌కాశం దొరుకుతుంది. ఒక‌వేళ అంద‌క పోతే .అక్క‌డి ప్ర‌భుత్వం వారి బాధ్య‌త‌ను తీసుకుంటుంది. ఇదంతా ఆ దేశం ప్ర‌పంచానికే ఆద‌ర్శ ప్రాయంగా ఎదిగేలా చేసిన ఘ‌న‌త .గ‌తంలో సింగ‌పూర్‌కు అధ్య‌క్షుడిగా కొన్నేళ్ల పాటు పాలించిన లీ క్వాన్ యూకే ద‌క్కుతుంది. వ్యాపారం, వాణిజ్యం, ఐటీ, లాజిస్టిక్, టూరిజం , టెక్నాల‌జీ , టెలికాం రంగాల‌లో సింగ‌పూర్ టాప్ గా నిలిచింది. అక్క‌డి వారంతా క‌ష్ట‌ప‌డ‌తారు.సుఖ ప‌డ‌తారు. వాళ్ల‌కు తెలిసింద‌ల్లా ఒక్క‌టే దేశం ప‌ట్ల విధేయులుగా ఉండ‌టం. ఆ దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవ‌డం. దీనిని లీ .అల‌వాటు చేశారు. వారిలో జాతీయ భావాన్ని పెంపొందించారు. నీతి, నిజాయితీ, క‌ష్ట‌ప‌డే త‌త్వాన్ని, క్రియేటిటీని పెంపొందించేలా దృష్టి పెట్టారు. ప్ర‌ధాన‌మంత్రిగా ఎక్కువ కాలం ప‌నిచేశారు. దేశాన్ని గాడిలో పెట్టారు. అభివృద్ధిలో ఇత‌ర దేశాల‌తో పోటీ ప‌డేలా తీర్చిదిద్దారు. దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేసి.ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చారు.

దేశాభివృద్ది చెందాలంటే రోడ్లు బాగుండాలి. ప‌ర్యాట‌కం అభివృద్ధి చెందాలి. అన్నిటికంటే దేశంలో నివ‌సిస్తున్న వారంతా నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసే శ్ర‌మ సంస్కృతిని అల‌వ‌ర్చు కోవాలి. ఒక్క‌రు వంద మందితో జ‌త క‌ట్టాలి. ఆ జ‌త‌లు వేలు.ల‌క్ష‌లు .కోట్లు కావాలి. ఆ క‌లిసి ఉండ‌ట‌మే అభివృద్ధికి సోపానంగా ఉప‌యోగ ప‌డుతుంద‌ని .బోధించారు.ఆచ‌రించారు.చేసి చూపించారు. చేత‌ల మ‌నిషిగా.నాయ‌కుడిగా లీ ఎదిగారు. ప్రపంచానికే ఆద‌ర్శ‌వంత‌మైన దేశంగా. అధినేత‌గా పేరు సంపాదించారు. సుదీర్ఘ‌మైన కాలం పాటు దేశానికి అధినేత‌గా ఉన్న నాయ‌కుడిగా చ‌రిత్ర సృష్టించారు. 3 జూన్ 1959 నుండి 28 న‌వంబ‌రు 1990 దాకా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. నియంత‌గా వ్య‌వ‌హ‌రించార‌ని, ఎన్నో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టి పారేశారు. సింగ‌పూర్ ప్ర‌ధాన‌మంత్రిగా ఎస్.రాజార‌త్నం త‌ర్వాత ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక అక్క‌డి నుండి ఆ దేశం రూపు రేఖ‌లు మారి పోయాయి. అభివృద్ధి ల‌క్ష్యంగా లీ ప‌నిచేశారు. తాను క‌ష్ట‌ప‌డ‌ట‌మే కాకుండా దేశ ప్ర‌జ‌లంద‌రినీ భాగ‌స్వాముల‌య్యేలా చేశారు. 16 సెప్టెంబ‌ర్ 1923లో జ‌న్మించిన ఈ నేత 2015 మార్చి 23న క‌న్ను మూశారు. త‌న వారసుల‌ను త‌యారు చేసి వెళ్లారు లీ. అద్దంలో ముఖం చూసుకుంటే ఎంత ఫ్రెష్‌గా క‌నిపిస్తుందో సింగ‌పూర్ మ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తుంది. ఊహించ‌ని రీతిలో వంద శాతం అనుకుంటే వేయి శాతం అభివృద్ధిని సాధించి చూపించారు అక్క‌డి జ‌నం.

ఏ ప్రాంతానికి వెళ్లినా.దేనిని త‌డిమినా లీ.భ‌విష్య‌త్ ద‌ర్శ‌నం క‌నిపిస్తుంది. అంత‌లా ఆయ‌న త‌న కంట్రీని ప్రేమించారు. ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందంజ‌లో ఉండేందుకు నానా క‌ష్టాలు ప‌డ్డారు. అక్క‌డి దేశ త‌ల‌స‌రి ఆదాయం .అమెరికాంటే ఎక్కువ‌. ప‌ని సంస్కృతి అక్క‌డే ఎక్కువ‌. టెక్నాల‌జీ వినియోగంలో ఆ దేశ‌మే ముందంజ‌లో ఉంది. నిర్మాణ రంగంలో ఆ కంట్రీనే టాప్. టూరిజం గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌తి రోజు ల‌క్ష‌లాది మంది జ‌నం ఇక్క‌డికి వ‌స్తూనే ఉంటారు. స్వ‌ర్గాన్ని త‌ల‌పించేలా ఉన్న ఈ న‌గ‌రాన్ని చూసేందుకు బారులు తీరుతారు. అక్క‌డి ఆతిథ్య‌మే కాదు గౌర‌వించే సంస్కృతి కూడా గొప్ప‌గా ఉంటుంది. మ‌న దేశానికి గాంధీని మ‌హాత్ముడిగా ఎలా కొలుస్తామో.అక్క‌డి ప్ర‌జ‌లు లీని జాతిపిత‌గా పిలుచుకుంటారు. సింగ‌పూర్ న‌గ‌ర నిర్మాత‌గా ఆయ‌న వినుతికెక్కారు. అక్క‌డి జ‌న‌మంతా లీని ప్రేమగా ఎంఎలీ అని గుర్తు చేసుకుంటారు. దీని అర్థం ఏమిటంటే మినిష్ట‌ర్.మెంటార్ .లీ అని. ఆర్థిక వాణిజ్య కేంద్రంగా ఈ న‌గ‌రాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దారు. ఎఫీసియంట్.అన్ సెంటిమెంట‌ల్, ఇన్వెంటివ్, ఫార్వ‌ర్డ్ లుకింగ్ అండ్ ప్రాగ్మ‌టిక్ అని న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక వ్యాఖ్యానించింది. మూడు దశాబ్దాలు పైబడి సింగపూర్‌కు ప్రధానమంత్రిగా పనిచేసిన లీ క్వాన్‌ యూ తన దీక్షా దక్షతలతో ఆ దేశాన్ని భాగ్యసీమగా మార్చేశాడు. అభివృద్ధి అంతా ఏకవ్యక్తి పాలనలో, ఏక పార్టీ ఏలుబడిలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. .

ఆరేళ్ల వయసులో. కట్టెతో చేసిన ఎద్దుల బండిలో.సరైన రహదారి కూడా లేని మార్గంలో ప్రయాణం చేశాడు లీ. ఏబై ఏళ్ల తరువాత సూపర్ సానిక్ విమానంలో లండన్ నుంచి న్యూయార్క్ న‌గ‌రానికి ఆయ‌న చేరుకున్నారు. ఈ విష‌యాన్ని త‌న పుస్త‌కంలో లీ రాసుకున్నారు. ఒక‌నాడు తాను ప‌డిన క‌ష్టాల‌ను గుర్తు చేసుకున్నారు . మొదటి సారి అధికారాన్ని చేపట్టినప్పుడు తమకు పాలనానుభవం లేకపోయినా. నిబద్ధత, సమాజాన్ని బాగు చేయాలన్న తపన. ముందుకు సాగిపోయేట్లు చేసిందంటారు. “ఆన్ ద జాబ్ ట్రెయినింగ్” లాగా, పదవిలో వుండగానే తానెంతో నేర్చుకున్నానంటారు. విమర్శలనెప్పుడూ ఆయన లెక్క చేయలేదు. రాజకీయ వారసత్వం ఎలా రూపు దిద్దుకోవాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. 30-40 ఏళ్ల వయసున్న వారిని రాజకీయాలలోకి లాగడంలో ఆయన దిట్ట. ఒక పథకం ప్రకారమే, తన వారసత్వాన్ని 1990 లో, గో చోక్ టోంగ్ కు బదలాయించారు. గో చోక్ తరువాత 2004 లో, తన పెద్ద కుమారుడు, లీ సూన్ లూంగ్ ప్రధాని కావడానికి మార్గం సుగమం చేశాడు.

సింగపూర్ ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసుకున్న లీ మదిలో జాతీయ భావాలు, ఆత్మగౌరవ ఆవేశం పెల్లుబుకింది. 1950 లో సింగపూర్ తిరిగొచ్చిన లీ, కార్మిక సంఘాల-రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని కమ్యూనిస్టులతో చేతులు కలిపాడు. కేవలం 35 సంవత్సరాల పిన్న వయసులో సింగపూర్ ప్రధానిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీతో ఉమ్మడి ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తరువాత విడిపోయారు. ఆగస్టు 1965 లో సింగ‌పూర్ ప్ర‌పంచంలోనే ఏకైక సర్వ సత్తాక గణతంత్ర నగర-రాజ్యంగా, ద్వీప దేశంగా ఏర్పడింది. 42 సంవత్సరాల లీ క్వాన్ యూ దేశ ప్ర ప్రథమ ప్రధానిగా, ఇరవై లక్షల మంది ప్రజల రక్షకుడిగా బాధ్యతలు చేపట్టారు. 1990 నవంబరు 28 వరకు ఆ పదవిలో కొనసాగి, తన వారసుడిగా గో చోక్ టోంగ్ ను ప్రధానిని చేసి, ఆయన మంత్రి వర్గంలోనే సీనియర్ మినిస్టర్ గా పనిచేశారు. ప్రధాని పదవి వదిలేశాక ప్రపంచం నలుమూలల పర్యటించి దేశాల నాయకులతో తన అనుభవాన్ని పంచుకున్నారు. దీనిలో భాగంగా లీ భారతదేశానికి పలుమార్లు వచ్చాడు.

భావి త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కుడిగా. ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచిన లీ నుండి ఎంతో నేర్చు కోవాల్సింది ఉంది. ఒక్క‌రి వ‌ల్ల ప్ర‌గ‌తి సాధించ‌లేం.క‌లిసి వుంటే దేనినైనా అందుకోగ‌ల‌మ‌ని ఆయ‌న నిరూపించారు. క‌ల‌లు క‌న‌డ‌మే కాదు వాటిని సాకారం చేసిన ఘ‌న‌త ఆయ‌న‌దే.

Comments

comments

Share this post

scroll to top