చేతుల్లేవ్..అయినా కాళ్ళనే చేతులుగా చేసుకొని అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన స్వప్న స్లోరీ ఇది.

మనం చేతులు,కాళ్ళు ఉండి కూడా పనిచేయడానికి ఎన్నో కారణాలు చెబుతుంటాం.. కానీ ఆమె జీవితం కారణాలతో, కన్నీళ్ళతో ఉండకూడదనుకుంది. అనుకున్నది సాధించింది. ఆమె వైకల్యాన్ని చూసి ఓటమే సలాం చేసింది.. స్వప్న అగస్తైన్ పుట్టుకతోనే రెండు చేతులు లేవు, తన కూతురిని చూసి బాధపడ్డారు ఆ తల్లిదండ్రులు.అందరి పిల్లలలాగే స్కూల్ కి వెళ్లి చదువుకుంటానని తన పేరెంట్స్ సాయంతో స్కూల్ కి వెళ్ళేది. అలా స్కూల్ లో తన  కాళ్ళతో పెయింటింగ్ వేయడం నేర్చుకుంది. తన తల్లిదండ్రులు గర్వపడేలా, తన ప్రతిభను  ప్రపంచానికి చాటి చెప్పాలని అ క్షణం నిర్ణయించుకుంది స్వప్న.

అహర్నిషలు కష్టపడి పెయింటింగ్ లో పర్పెక్షన్ సాధించింది స్వప్న….కాళ్లతో వేసిన ఆమె పెయింటింగ్స్  పలు మ్యాగజైన్లలో ప్రచురించబడ్డాయి. అన్నీ సక్రమంగా పనిచేసిన ఇంటికే పరిమితమయ్యే చాలామంది మసస్తత్వానికి ఆమె మనస్తత్వానికి చాలా తేడా ఉంది…ఎందకంటే ఆమె వీలు చిక్కినప్పుడల్లా సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top