డ్రామా కాదండోయ్..”స్వామిజి” కూతురి పెళ్లి..! లక్ష్మిదేవిలా దర్శనం ఇచ్చిన పెళ్లికూతురి అసలు భాగోతం తెలుసా.?

నిన్నంతా ఎఫ్బీలో కొన్ని ఫోటోలు హల్ చల్ చేశాయి..ఫస్ట్ టైం  సడన్ గా చూడగానే ఏదో నాటకం ఫోటోలు అనుకున్నాను..తర్వాతర్వాత అందరి వాల్స్ పై అవే ఫోటోలు,ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు కామెంట్స్..ఫోటోలకంటే కామెంట్స్ చాలా ఫన్నీగా అనిపించి మళ్లీ ఆ ఫోటోలు చూసా..దేవతల వేశాల్లో మనుషులు..తలపై కిరిటాలు,మెడలో నగలు ..అచ్చంగా దేవతల్లానే..ఏంట్రా ఇది అని చూస్తే పెళ్లి తంతు ఫోటోల్లా ఉన్నాయి..కానీ మొత్తానికి అర్దం అయింది ఏంటంటే దేవతల వేశాల్లో అచ్చంగా విష్ణుమూర్తి,లక్ష్మీదేవి ల పెళ్లిలా జరిపించిన నిజమైన పెళ్లి అనీ.. సరే పెళ్లి పెద్ద నిర్ణయించుకోగానే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోవచ్చు కానీ..వియ్యాల వారు ఎలా ఒప్పుకున్నారో నాకైతే అర్దం కావట్లేదు… ఒకసారి ఆ ఫోటోలు మీరూ చూసి తరించండి..పెళ్లిఫోటోలే కాదు లక్ష్మీదేవి అసలు స్వరూపం కూడా చూడండి..

ఇంతకీ ఈ వింత పెళ్లి జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని తణుకులో..శ్రీధర్ అనే వ్యక్తి తన కూతురుకి ఈ విధంగా వివాహం జరిపించారు.పశ్చిమగోదావరి జిల్లా  ముక్కామల  గ్రామానికి చెందిన శ్రీధర్ స్వామిజీ తన కుమార్తె పెళ్లిని దేవతల పరిణయంగా జరిపించారు. సాక్షాత్తు విష్ణుమూర్తి వేషంలో పెళ్లికొడుకు.. లక్ష్మీదేవిగా పెళ్లికుమార్తె హర్షితను ముస్తాబు చేశారు. వారికే కాదు ఇక.. కుటుంబ సభ్యులంతా దేవతామూర్తుల అవతారాల్లో హాజరై పెళ్లి వేడుక నిర్వహించటం ఇక్కడ ఆసక్తికరమైన విషయం .. పౌరాణిక నాటికలా ఉన్న ఈ పెళ్లి వేడుక మొత్తం ఏదో కొన్ని యుగాల కింద జరిగితే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉంది.

 ముక్కామల గ్రామంలో శ్రీధర్ స్వామిజీ 20 ఏళ్లుగా ఆశ్రమాన్ని నడుపుతున్నారు. అధ్యాత్మిక బోధనలు చేస్తుంటారు. ఆయన కుమార్తె పెళ్లి తణుకు కల్యాణమండపంలో జరిగింది. స్వామీజీలంటే అన్ని త్యజించాలి కానీ ఈ ఆడంబరమైన వేడుక వివాహం ఏంటో..సరే ఇది వదిలేద్దాం కానీ..పెళ్లి వేడుకలో లక్ష్మీదేవిలా దర్శనం ఇచ్చిన పెళ్లి కుమార్తే హర్షిత మహాకాళీ రూపం మనం గతంలోనే చూసాం..రెండేండ్ల క్రితం రోడ్ పై పోలిసులతో గొడవ పడ్డ ఈ దేవతకానీ దేవత వీడియో ,ఇప్పుడు ఈ పెళ్లితంతుతో మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..నా కార్ ని ఆపుతారా అంటూ పోలిసులపై చిందులేసిన లక్ష్మీదేవి ఉరఫ్ హర్షిత..వీడియోపై మీరు లుక్కేయండి.

watch video:

Comments

comments

Share this post

scroll to top