లోఫర్ సినిమాలోని అధ్బుతమైన పాట.! ఈ రోజుల్లో ఇటువంటి సాహిత్యం అందించిన అశోక్ తేజకు అభినందనలు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా విడుదలకు రెడీ అయిన చిత్రం లోఫర్, ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకను డిసెంబర్ 7 న హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమాలో సుద్దాల అశోక్ తేజ రాసిన సువ్వి సువ్వాలమ్మా… అనే పాటకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ పాటలోని అధ్బుతమైన సాహిత్యానికి జత కలిసిన మ్యూజిక్ పాటను మరింత అందంగా ….ఫీల్ తో వినేలా చేసింది. సునిల్ కశ్యప్  ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ పాట ఖచ్చితంగా మన ఫేవరెట్ లిస్ట్ లో ఉండాల్సిందే. ఈ రోజుల్లో ఇంతమంచి అర్థవంతమైన లిరిక్స్ ఇచ్చిన సుద్దాల అశోక్ తేజ గారికి ధన్యవాదములు.  తల్లి గుర్తింపు కోసం ఓ కొడుకు పడే ఆవేదనను కంటికి కట్టినట్టు చూపించిన సుద్దాలకు హ్యాట్సాఫ్!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top