IPL లో వ‌చ్చిన డ‌బ్బుల‌తో…త‌ల్లిదండ్రుల‌కు ఖ‌రీదైన కార్ ను గిఫ్ట్ గా ఇచ్చిన క్రికెట‌ర్.!

“ఇదో ఎమోషనల్ మూమెంట్‌. ఇది నేను కొన్న మొదటి కారు. కానీ, ఇది నా కోసం కాదు. నేను కొన్న మొదటి కారును అమ్మానాన్నలకు బహుమతిగా ఇస్తున్నాను. ఈ రోజు నేను మీ ముందు ఉండటానికి కారణం వారే. అందుకే వారికి నా కానుక. ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా. లవ్‌ యూ మామ్‌ అండ్‌ డాడ్‌”

అంటూ ముంబాయ్ ఇండియ‌న్స్ ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్…ఇన్స్టాగ్రామ్ ద్వారా త‌న ఫీలింగ్ ను పంచుకున్నారు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సూర్యకుమార్‌ యాదవ్‌ను ఈ ఏడాది వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.3.02 కోట్లకు దక్కించుకుంది.

ఈ సీజ‌న్ లో యాద‌వ్ మంచి ఇన్నింగ్స్ నే ఆడాడు.. ఐపీఎల్ 2018 సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్‌ 521 పరుగులు చేశాడు. భారత్‌ తరఫున ఆన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఓ ఐపీఎల్‌ సీజన్‌లో 500లకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ అరుదైన రికార్డు సాధించాడు.

Comments

comments

Share this post

scroll to top