సూర్య మూడోసారి కూడా హిట్ కొట్టాడంటారా?..”యముడు -3 (s3)” స్టోరీ, రివ్యూ, రేటింగ్ (తెలుగులో)

Movie Title: Yamudu 3 (Tamil Version: S3 / Singam3)

Cast & Crew:

 • నటీనటులు: సూర్య, అనుష్క శెట్టి, శృతి హస్సన్, అనూప్ సింగ్, నాస్సర్ , రాధిక
 • దర్శకుడు: హరి
 • సంగీతం: హర్రీస్ జయరాజ్
 • నిర్మాత: జ్ఞానవేల్ రాజా

Story:

వైజాగ్ పోలీస్ కమీషనర్ ని హత్య చేసి, అక్రమంగా చెత్తని వ్యాపారం కోసం వైజాగ్ లో పూడుస్తుంది ఒక స్మగ్గ్లింగ్ ముఠా!…చనిపోయిన కమీషనర్ స్థానంలో డీసీపీగా ఉన్న “దురై సింగం”(సూర్య) ని కమీషనర్ (crime branch) గా ప్రమోట్ చేసి హత్య వెనకాల ఉన్న మిస్టరీని పసిగట్టమని ఆదేశిస్తుంది పోలీస్ శాఖ…ఈ క్రమం లో జర్నలిస్ట్ అయిన “విద్య” (శృతి హస్సన్) తో సింగం కి పరిచయం పెరుగుతుంది!..కేసు విషయంలో సింగం కి విద్య సహాయం చేస్తూ ఉంటుంది…అనుకోకుండా “విద్య” సింగం తో ప్రేమలో పడిపోతుంది…కానీ విద్యకి “సింగం” కావ్య(అనుష్క) తో తన పెళ్లి నిశ్చయమైన విషయం తెలుపుతాడు… ఇది ఇలా ఉండగా వైజాగ్ లో అన్ని అక్రమాలకు కారణం “విట్టల్ ప్రసాద్” (అనూప్ సింగ్) అని “సింగం” ఇన్వెస్టిగేషన్ లో పసిగడతాడు…ఇక సింగం పోలీస్ గా దుర్మార్గుల అంతు ఎలా చూసాడు అనేది తెలియాలి అంటే “యముడు -3 ” సినిమా చూడాల్సిందే!

Review:

సినిమా మొత్తం “సూర్య” వన్ మాన్ షో…మొదటి రెండు భాగాలు ఎలా ఉన్నాయో, ఇది కూడా అలాగే ఉంది…కాకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ తోడయ్యింది…ఈ సినిమాకి “హర్రీస్ జయరాజ్” అందించిన మ్యూజిక్ ఆడియన్స్ కి ఆకట్టుకుంది…సూర్య ని ఈ సినిమాలో సరికొత్త లుక్ లో చూపించారు..కాకపోతే అనుష్క, శృతి కేవలం పాటలకే పరిమితమయ్యారు..వాళ్ళ పాత్రలని సినిమాలో సరిగా ఉపయోగించుకోలేకపోయారు…రెండు పార్ట్స్ చూసినా కూడా మూడోది ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా ఉండడానికి దర్శకుడు “హరి” చాలా కష్టప్రయత్నమే చేసాడు అని చెప్పచ్చు!

Plus Points:

 • సూర్య లుక్, వన్ మాన్ షో, ఆక్షన్ పెర్ఫార్మన్స్
 • హర్రీస్ జయరాజ్ సంగీతం
 • లొకేషన్స్
 • విజువల్స్
 • స్క్రీన్ప్లే, దర్శకత్వం
 • ట్విస్ట్స్

Minus Points:

 • అనుష్క, శృతి హస్సన్ కొన్ని సీన్స్, పాటలకే పరిమితం అవ్వడం
 • రొటీన్ స్టోరీ
 • సెకండ్ హాల్ఫ్ సాగతీయడం
 • సినిమా లెంత్ ఎక్కువ అవ్వడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది!

Final Verdict:

సూర్య ఫాన్స్ కి మంచి ఆక్షన్ పెర్ఫార్మన్స్ కనువిందుగా ఉంటుంది…మధ్యలో బోర్ కొట్టించకుండా అనుష్క, శృతి హస్సన్ స్క్రీన్ మీద కనిపిస్తారు…ఆక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా తోడయ్యింది…సినిమాలో ఉండే ట్విస్ట్స్ కోసం ఈ సినిమా చూడచ్చు

AP2TG Rating: 3/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top