సూర్య, జ్యోతిక, కార్తీ దగ్గరుండి జరిపించిన పెళ్లి ఎవరిదో తెలుసా.? ఖర్చులన్నీ వారివే..!

తమిళంలోనే కాదు తనదైన నటనతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న నటుడు సూర్య. ఈ మధ్య ఒక ప్రోగ్రామ్ లో స్టేజిపై ఉన్న సూర్య ని కలవడానికి వెళ్లిన అభిమానులు ఒక్కొక్కరిగా సూర్య కాళ్లకి దండం పెట్టడం ప్రారంభించారు..వెంటనే సూర్య తన కాళ్లకి దండం పెట్టినవారి కాళ్లకు తనూ తిరిగి కాళ్లకి నమస్కరించాడు..మీరు ఆపితేనే నేను కూడా ఆపుతానని సూర్య చెప్పడంతో అభిమానులు తన కాళ్లకు నమస్కారం చేయకుండా ఆలింగనం చేసుకుని వెళ్లిపోయారు..మచ్చుకు ఇదొక ఉదాహరణ మాత్రమే సూర్య గురించి చెప్పడానికి..కానీ రోజు రోజుకి సూర్య,సూర్య కుటుంబం తమ అభిమానుల పట్ల,సేవకుల పట్ల చేసే మంచిపనులు సూర్య పట్ల మనకున్న గౌరవాన్ని పెంచుతాయి,..

సూర్య తండ్రి శివకుమార్ అప్పట్లో తమిళ పరిశ్రమలో పేరున్న నటుడు..సూర్య తమ్ముడు కార్తీ మనకు సుపరిచితమే..నటి జ్యోతిక తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి..అయితే తమిళ చిత్రపరిశ్రమలో నటినటులకు రాజకీయాలతో ప్రత్యక్షంగానో,పరోక్షంగానో సంభందాలుంటాయి..కానీ రాజకీయాలతో ఏ సంభందంలేకుండా నిస్వార్దంతో సేవ చేస్తున్న కుటుంబం సూర్య వాళ్లది.అగరం ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి.. చాలా ఏళ్లుగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్య.. అతడి కుటుంబ సభ్యులు. తల్లిదండ్రులు లేక అనాథలుగా మారిన.. పేద కుటుంబాలకు చెందిన వేలాది మంది చిన్నారులకు ఈ సంస్థ చదువు చెప్పిస్తోంది. వారి బాగోగులు చూస్తోంది. చాలామంది లాగా పబ్లిసిటీ కోసం నామమాత్రంగా ఫౌండేషన్ పెట్టి హడావుడి చేయడం కాకుండా.. చాలా సిన్సియర్ గా అగరం ను నడుపుతుందని సూర్య కుటుంబానికి పేరుంది.

ఇక‌, సూర్య‌, కార్తీ అభిమానుల‌తో రెగ్యుల‌ర్ ట‌చ్‌లోఉంటారు. వారితో చాలా ఆప్యాయంగా క‌లిసిపోతారు.తన అభిమాని ఒకరు చనిపోతే కార్తీ స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి దహన సంస్కారాలకు కావలసిన డబ్బుసాయం చేసిన ఘటన మనకు తెలుసు.. తాజాగా త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే ఓ వ్య‌క్తి వివాహానికి సూర్య కుటుంబ స‌మేతంగా హాజ‌ర‌య్యాడు. పెళ్లిని ద‌గ్గ‌రుండి జ‌రిపించాడు. కుటుంబ పెద్ద‌గా తాళిని స్వ‌యంగా అందించాడు.  అలాగే ఆ పెళ్లి ఖ‌ర్చునంత‌టినీ భ‌రించాడు. సూర్య ,జ్యోతిక పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన ఈ వివాహం  ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Comments

comments

Share this post

scroll to top