విడుదలైన NGK తెలుగు టీజర్.. సూర్య యాక్టింగ్ ఇరగదీసాడు..!!

హీరో సూర్య కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. తెలుగు లో రజినీకాంత్ గారి తరువాత ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరో సూర్య నే. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన గ్యాంగ్ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. హిందీ లో సూపర్ హిట్ అయిన స్పెషల్ 26 చిత్రానికి గ్యాంగ్ సినిమా రీమేక్, గ్యాంగ్ సినిమా అంచనాలని అందుకోలేక తమిళం లో కూడా విజయం సాధించలేకపోయింది. ఇటీవల కాలం లో సరైన సక్సెస్ లు లేక సూర్య ఇబ్బంది పడుతున్నాడు, NGK సినిమా తో కచ్చితంగా ఒక సాలిడ్ హిట్ కొడతా అని నమ్మకంగా ఉన్నాడు సూర్య. టీజర్ చూసాక సూర్య అభిమానులకి కూడా నమ్మకం కలిగింది ఈ సినిమా పైన.

పాలిటిక్స్ చుట్టూ.. :

NGK చిత్రం పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటించారు. తెలుగు లో రకుల్ ప్రీత్, సాయి పల్లవి లకు మంచి క్రేజ్ ఉండటం తో NGK సినిమా పైన తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలే ఉన్నాయ్, NGK సినిమాలో సూర్య నటనే సినిమాకి హైలైట్ అవుతాదని NGK చిత్ర దర్శకుడు చెబుతున్నాడు. సమ్మర్ లో NGK సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ సినిమాతో సూర్య తమిళ్ నాడు లో కొత్త రికార్డ్స్ సృష్టిస్తాడో లేదో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top